బిల్డర్లకు నియంత్రణ ఉండాలి

KTR
KTR


హైదరాబాద్‌: నగరంలోని తాజ్‌ డెక్కన్‌లో తెలంగాణ బిల్డర్స్‌ ఫెడరేషన్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటిఆర్‌, సికింద్రాబాద్‌ టిఆర్‌ఎస్‌ ఎంపి అభ్యర్థి తలసాని సాయికిరణ్‌ యాదవ్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. సాయికిరణ్‌కు బిల్డర్స్‌ మద్దతు పలికారు. ఈ సందర్భంగా కేటిఆర్‌ మాట్లాడుతూ..దేశంలోనే అత్యుత్తమ జీవన ప్రమాణాలు కలిగిన నగరంగా హైదరాబాద్‌ ఐదోసారి ఎంపికైంది. బిల్డర్లు లంచాలతో మేనేజ్‌ చేస్తే వారి బ్రాండ్‌ దెబ్బతింటుంది. బిల్డర్లు కూడా స్వీయ నియంత్రణ కలిగి ఉండాలి. నిర్మాణ రంగంలో తెలంగాణ అగ్రగామిగా ఉందని, హైదరాబాద్‌ని విశ్వనగరంగా తీర్చిదిద్దుతున్నాం అని అన్నారు. పట్టణ ప్రాంతాల్లో కూడా భూరికార్డుల ప్రక్షాళన చేయాలని సియం కేసిఆర్‌ ధృడసంకల్పంతో ఉన్నారని అన్నారు. ప్రభుత్వంలో ఉన్న లోపాలను సరి చేసుకుంటూ ముందుకెళ్లే మనకున్న లక్ష్యాలను సాధించొచ్చన్నారు. కేసిఆర్‌కు వేరే ఎజెండాలు లేవు, అభివృద్దే ఆయన ఎజెండా అని కేటిఆర్‌ స్పష్టం చేశారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/