సీఆర్డీఏ అంశంపై సిఎం జగన్ కీలక భేటి
సీఆర్డీఏ చట్టంపై ప్రత్యేకంగా దృష్టి సారించిన జగన్

అమరావతి: జగన్ ప్రభుత్వం ఏపిలో మూడు రాజధానుల అంశంపై కృతనిశ్చయంతో ఉన్నట్టు తాజా పరిణామాల ద్వారా అర్థమవుతోంది. మూడు రాజధానుల అంశంపై హైపవర్ కమిటీ ఇప్పటికే సీఎం జగన్ తో సమావేశమై చర్చలు జరిపింది. ఇక మిగిలింది సీఆర్డీఏ చట్టం. రాజధానిని అమరావతి నుంచి తరలించాలంటే అనేక చిక్కుముడులతో కూడిన సీఆర్డీఏ చట్టం ప్రధాన అవరోధంగా పరిణమించే అవకాశం ఉందని ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో సీఆర్డీఏ చట్టంపై చర్చించేందుకు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డిలతో సీఎం జగన్ సమావేశమయ్యారు. సీఆర్డీఏ విషయంలో న్యాయపరమైన, సాంకేతికపరమైన ప్రతిబంధకాలు రాకుండా ఎలా వ్యవహరించాలన్న విషయాలను సీఎం జగన్ ఈ సమావేశంలో చర్చించనున్నారు.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/sports/