టిడిపి కంటే వైఎస్‌ఆర్‌సిపిలోనే ధనవంతులు

Buddha Venkanna
Buddha Venkanna

అమరావతి: టిడిపి కంటే ఎక్కువ మంది ధనవంతులు వైఎస్‌ఆర్‌సిపిలోనే ఉన్నారని టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు. ఎన్నికల సందర్భంగా టిడిపిని లక్ష్యంగా చేసుకుని ఐటీ అధికారులు, పోలీసలు దాడులు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అయితే పీవీపీ, పీలేరు రామచంద్రారెడ్డి, బొత్స, మాగంటి శ్రీనివాసలు రెడ్డి వంటి వారిపై ఐటీ అధికారులు ఎందుకు దాడి చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. మోడికి జగన్‌ దత్త పుత్రుడు కాబట్టే అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. జగన్ తన పార్టీ కార్యకర్తలతోనే దాడులు చేయించుకుని సానుభూతి పొందే కుట్రలు చేస్తున్నారన్నారు. బుద్దావెంకన్న అన్నారు.


మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/