నేటి నుండి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

న్యూఢిల్లీ: ఈరోజు నుండి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని నిర్వహించి, ఈ సమావేశాలను ప్రారంభిస్తారు. ఆర్థిక సర్వేను కూడా శుక్రవారమే ప్రవేశపెట్టనున్నారు. 202021 సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెడతారు. రెండు దశల బడ్జెట్ సమావేశాల్లో తొలి దశ నేటి నుంచి ఫిబ్రవరి 11 వరకూ జరుగుతాయి. రెండో దశ సమావేశాలు మార్చి 2 నుంచి ఏప్రిల్ 3 వరకు జరుగుతాయి. పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) వ్యతిరేక ఆందోళనలు, దేశంలో నెలకొన్న ఆర్థిక మందగమనం దృష్టిలో ఉంచుకొని రాబోయే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు వాడీవేడిగా జరిగే వీలుంది. సిఎఎపై ఎక్కువ దృష్టి ఉంటుందని భావిస్తున్నప్పటికీ, ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించే ప్రణాళికలపై ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం ఉంది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/