బడ్జెట్ లో వ్యవసాయానికి అగ్రతాంబూలం

తెలంగాణ రైతులకు ‘రైతుబంధు’

ఏటా ఎకరానికి రూ.10వేలు

TS Minister Harish Rao

గత శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రైతుబంధు సాయాన్ని ఎకరానికి ప్రతి సంవత్సరం రూ.10వేలకు పెంచి అందిస్తుంది. కొత్తగా పాస్‌పుస్త కాలు ఇవ్వడం వలన రైతుబంధు లబ్ధిదారుల సంఖ్య వచ్చే సంవత్సరం పెరుగుతుంది.

పెరిగిన లబ్ధిదారుల సంఖ్యకు అనుగుణంగా బడ్జెట్‌లో రెండువేల కోట్ల రూపాయలను అదనంగా ప్రతిపాదించారు. 2020-21 వార్షిక బడ్జెట్‌లో రైతుబంధు పథకం కోసం రూ. 14వేల కోట్లు ప్రతిపాదించారు. రైతుబంధు పథకం సత్ఫలితాలను ఇవ్వడం వలన అనేక రాష్ట్రాలు రైతుబంధు తరహాలో పథకం ప్రారంభించాయి.

తె లంగాణరాష్ట్ర ఆర్థిక మంత్రిగా హరీష్‌రావ్ఞ మొదటిసారి బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టారు. భారతదేశం, తెలంగాణ రాష్ట్రం, ఆర్థికమాంద్యం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో హరీష్‌రావ్ఞ 2020-21 తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. భారతదేశ ఆర్థికవృద్ధిరేటు గత ఏడాదిన్నర సంవత్సరాలుగా తగ్గతూ వస్తుంది. ఈ కారణంగా కేంద్ర ప్రభుత్వ ఆదాయం తగ్గింది. దీనితో కేంద్రం నుండి రాష్ట్రాలకు రావలసిన వాటా కూడా తగ్గింది.

2019-20 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి రావలసిన పన్నుల వాటా, బడ్జెట్‌లో వేసు కున్న అంచనాల కంటె 3,731కోట్ల రూపాయలు తగ్గింది. రాష్ట్రా నికి కేంద్రం నుంచి రావలసిన ఐ.ఓ.ఎస్‌.టిలో కాని జిఎస్‌టి పరిహారంలోకాని నిధులు సకాలంలో రావటం లేదని, వచ్చే నిధులు కూడా అరకొరగా విడుదల చేస్తున్నదని హరీష్‌రావ్ఞ తెలిపారు.

ఈ పరిణామాల వల్ల రాష్ట్ర వృద్ధిరేటు 2018-19లో 16.1 శాతం ఉంటే అది 2019-20 ఫిబ్రవరి చివరి నాటికి 6.3 శాతానికి తగ్గింది. 15వ ఆర్థిక సంఘం మధ్యంతర నివేదిక ప్రకా రం తెలంగాణాకు వచ్చే పన్నుల వాటా 2.437 శాతం నుంచి 2.133 శాతానికి తగ్గింది.

దీనివల్ల 2020-21ఆర్థిక సంవత్స రంలో తెలంగాణ రాష్ట్రానికి రావలసిన నిధుల్లో 2,384 కోట్ల రూపాయలు తగ్గుతాయి. ఇటువంటి ప్రతికూల పరిస్థితుల్లో సరైన వ్యూహాలను రూపొందించి అభివృద్ధి దిశగా పురోగమించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు అర్థమవుతుంది. 2020-21 వార్షిక బడ్జెట్‌లో వ్యవసాయ అభివృద్ధికోసం రైతుల సంక్షేమం కోసం భారీగానే కేటాయింపులు ప్రతిపాదించారు. వ్యవసాయాన్ని పండగలా చేయాలని భావించారు.

వ్యవసాయరంగానికి అగ్రతాంబులం ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు వ్యవసాయం జీవనాధారం. సరైన సమయానికి రుణాలు లభించక, పండించిన పంటకు సరైన ధరలు లభించక అతివృష్టి, అనావృష్టికి లోనై తెలంగాణ రైతాంగం అనేక సమస్యలను ఎదుర్కొంటూ నిరాశనిస్పృహలకు గురికావడమేకాక కొన్ని సందర్భాలలో అప్పులుతీర్చలేక బలవన్మారణాలకు పాల్పడుతున్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుంచి రైతుల సంక్షేమం అభివృద్ధి కోసం కెసిఆర్‌ నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నది. 2020-21 వార్షిక బడ్జెట్‌లో కూడా రైతుల సంక్షేమానికి వ్యవసాయరంగం అభివృద్ధికి పెద్దమొత్తంలో కేటాయింపులు చేశారు.

ఒకప్పుడు పంటలు పండించిన రైతుల నుండి ప్రభుత్వం భూమిశిస్తు వసూలు చేసేది. ఇందుకు పూర్తి భిన్నంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రైతుబంధు పథకం రూపంలో ఆర్థిక సహాయం చేస్తుంది. మొదట్లో ఎకరానికి నాలుగువేల రూపాయల చొప్పున రెండుపంటలకు కలిపి సంవత్సరానికి ఎనిమిదివేల రూపాయల ఆర్థికసహాయం చేసింది. గత శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రైతుబంధు సాయాన్ని ఎకరానికి ప్రతి సంవత్సరం రూ.10వేలకు పెంచి అందిస్తుంది.

కొత్తగా పాస్‌పుస్తకాలు ఇవ్వడం వలన రైతుబంధు లబ్ధిదారుల సంఖ్య వచ్చే సంవత్సరం పెరుగుతుంది. పెరిగిన లబ్ధిదారుల సంఖ్యకు అనుగుణంగా బడ్జెట్‌లో రెండువేల కోట్ల రూపాయలను అదనంగా ప్రతిపాదించారు. 2020-21 వార్షిక బడ్జెట్‌లో రైతుబంధు పథకం కోసం రూ. 14వేల కోట్లు ప్రతిపాదించారు. రైతుబంధు పథకం సత్ఫలితాలను ఇవ్వడం వలన అనేక రాష్ట్రాలు రైతుబంధు తరహా లో పథకం ప్రారంభించాయి.

గమనించాల్సిన అంశం ఏమిటంటే కేంద్రప్రభుత్వం కూడా రైతుబంధు పథకం ప్రేరణతో ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధిని రూపొందించి అమలుపరుస్తోంది. భారతీయ రైతులు అతివృష్టి, అనావృష్టి కారణంగా అప్పులో పుట్టి, అప్పులో పెరిగి మరణిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మార్పు తేవాలని భావించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుబీమా, రైతురుణమాఫీ పథకాలను ప్రవేశపెట్టింది. తెలంగాణ రాష్ట్రంలో 18 సంవత్సరాల వయసు నుండి 60 సంవత్సరాల వయసు గల రైతు ఎవరైన మరణిస్తే రుణసహాయాన్ని వారి కుటుంబానికి అందచేస్తారు. రైతులపై ఆర్థికభారం పడకుండా ప్రతిరైతు పేరిట 2,271.50 రూపాయల ప్రమియంను ప్రభుత్వం ఎల్‌ఐసికి చెల్లిస్తుంది. రైతు మరణించిన పది రోజుల్లోనే ఈ సహయాన్ని కుటుంబ సభ్యులకు అందచేస్తారు. రైతుబీమా కోసం 2020-21 బడ్జెట్‌లో రూ. 1,141 కోట్లు ప్రతిపాదించడం రైతులపై ప్రభుత్వా నికి ఉన్న ప్రేమను తెలియచేస్తుంది.

తెలంగాణ రాష్ట్రంలో 25వేల రూపాయలలోపు రుణాలున్న రైతులు 5,83,916 మంది ఉన్నా రు. వీరందరి రుణాలను మాఫీ చేస్తున్నట్లు ఆర్థికమంత్రి ప్రకటిం చారు. ఈ నెలలోనే 25వేల రూపాయలలోపు రుణాలను మాఫీ చేయడానికి ప్రభుత్వం బడ్జెట్‌లో 1,198 కోట్ల రూపాయలు విడు దల చేయనుంది. రూ. 25వేలనుండి లక్షలోపు ఉన్న రైతుల రుణాల మొత్తం 24,738 కోట్ల రూపాయలు. నాలుగు విడతల లో రైతులకు చెక్కుల రూపంలో డబ్బును అందచేస్తారు. ఈ సంవత్సరం రైతు రుణమాఫీ కోసం రూ. 6225 కోట్లు ప్రతి పాదించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలలో మరో ప్రధాన సమస్య పండించిన పంటకు సరైన ధర లభించకపోవడం. ఈ కారణంగా రైతులు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతులు పండించిన పంటలకు మద్దతు ధర లభించే విధంగా చర్యలు గైకొంటున్నారు. వరి, పత్తి, మొక్కజొన్న, కందులు తదితర పంటల కనుగోలుకు అనేక కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా రైతులకు సరైన ధర వచ్చేలా చేసింది. ప్రభుత్వం కంది రైతులను ఆదుకునే లక్ష్యంతో ఎంత ఖర్చయినా కందులు కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం పంటలు పండించే రైతులకు ఉరటనిస్తుంది.

వ్యవసాయం సజావ్ఞగా కొనసాగాలంటే రైతులకు సకాలంలో నాణ్యమైన కల్తీలేని విత్తనాలు, ఎరువ్ఞలు లభించాలి. అనేకసార్లు రైతులకు సరైన సమయంలో విత్తనాలు ఎరువ్ఞలు లభించక సమస్యలు ఎదుర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యను గమనించి దూరదృష్టితో ప్రతి సంవత్స రం ఎండాకాలంలోనే ఎరువ్ఞలు, విత్తనాలు సమీకరించి గోదాము ల్లో నిలువ చేస్తున్నది. ఇందుకోసం గోదాముల నిల్వసామర్థ్యాన్ని భారీగా పెంచింది. సమైక్యరాష్ట్రంలో గోదాముల నిల్వ సామర్థ్యం 4.17 లక్షల మెట్రిక్‌టన్నులు ఉండగా ప్రస్తుతం 22.47 లక్షల మెట్రిక్‌ టన్నుల నిల్వ సామర్థ్యం గల గోదాముల అందుబాటులోకి వచ్చాయి.

వ్యవసాయ సీజన్‌ కన్నా ముందే రైతులకు విత్తనాలు ఎరువ్ఞలు అందడంతో రైతులు సకాలంలో వ్యవసాయ పనులను నిరాటకంగా కొనసాగించగలుగుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పా టుకు ముందు 2013-14లో విత్తనాల సబ్సిడీ కోసం మొత్తం 76కోట్ల71 లక్షలు ఖర్చు చేశారు. 2019-20 సంవత్సరంలో ఇందుకు రెట్టింపుగా రూ.142 కోట్లు తెలంగాణ ప్రభుత్వం విత్త నాల సబ్సిడీ అందచేసింది. రైతులకు ఆదాయం పెరగాలంటే వారి వ్యవసాయ అనుబంధ పరిశ్రమలను అభివృద్ధిపరచడానికి చర్యలు తీసుకోవాలి.

ముఖ్యంగా పాడి పరిశ్రమను అభివృద్ధి చేయాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాడిపరిశ్రమకు ప్రోత్సా హకాలను అందిస్తుంది. ఈ పరిశ్రమను బలోపేతం చేయడం కోసం రైతుల నుంచి సేకరించే పాలపై లీటరుకు నాలుగు రూపాయల చొప్పున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకాన్ని అందిస్తున్నది. దీని ద్వారా సుమారు 99వేల 282 మంది పాడి రైతులు లాభం పొందుతున్నారు. పాడి రైతులకు అందించే ప్రోత్సాహకం కోసం 2020-21 బడ్జెట్లో రూ.100కోట్లు ప్రతిపాదించారు. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం అభివృద్ధి చెందాలంటే సాగునీటి రంగానికి ప్రాముఖ్యం కల్పించాలి. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణా సాగునీటి రంగం అభివృద్ధిలో వివక్షకు గురైంది. కోటి ఎకరాలకు సాగునీరు అందించాలన్నది ముఖ్య మంత్రి ఆకాంక్ష.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి అవసరమయితే చర్యలు గైకొనడం జరిగింది. సాగునీటి రంగానికి ఈ సంవత్సరం బడ్జెట్లో రూ. 11,054 కోట్ల రూపాయలను ప్రతిపాదించారు. రైతు సమన్వయ సమితుల పేరును రైతుబంధు సమితులుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. అసంఘటితంగా ఉన్న రైతులను సంఘటితంగా మార్చడం రైతుబంధు సమితుల ప్రధానాశయం.

రైతులు పరస్ప రం చర్చించుకోవడానికి వీలుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఐదువేల ఎకరాల క్లస్టర్‌కు ఒకటి చొప్పున రైతు వేదికలను నిర్ణ యించడం సకారాత్మక చర్య. రైతులు సంఘటితమై తమ సమ స్యలు చర్చించుకోవడానికి ఇది తోడ్పడుతుంది.ఒక్కో రైతు వేదికను 12 లక్షల వ్యయంతో నిర్మించాలని భావిస్తున్నారు. రైతు వేదికల నిర్మాణం కోసం బడ్జెట్లో రూ.350 కోట్లు ప్రతిపాదించారు.

  • డా.పి.మోహన్‌రావు

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/