బడ్జెట్‌లో పెట్టుబడిదారులకే పెద్దపీట!

Nirmala Seeta raman

మౌలికరంగ వసతుల కల్పనకు అవసరమైన 6,500ప్రాజెక్టులలో ప్రైవేట్‌ భాగస్వామ్యంతో కలిసి రూ.103లక్షల కోట్లు పెట్టుబడులుగా పెట్టి మౌలికరంగాన్ని అభివృద్ధి చేస్తామని బడ్జెట్‌ ప్రసంగంలో చెప్పారు. గత కొన్ని సంవత్సరాలలో ప్రభుత్వం పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంకుల్లో 3,50,000 కోట్లు పెట్టుబడులుగా పెట్టింది.అయితే గత ఆరు సంవత్సరాలలో ప్రభుత్వ బ్యాంకులకు రావలసిన రూ. 13 లక్షల కోట్లల్లో దాదాపు రూ.ఐదు లక్షలకోట్ల మొండిబకాయిలను ప్రభుత్వం మాఫీచేసింది. ఇంకా రూ.8లక్షల కోట్ల మొండిబకాయిలు వసూలు కావాలి.వీటికి నిరర్థక ఆస్తులుగా పేరు పెట్టుకున్నారు.

కేం ద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2020-21 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో మొత్తం రెవెన్యూరాబడులను రూ. 20,20,926 కోట్లు. పెట్టు బడిరాబడులను రూ.10,21,304 కోట్లువెరసి మొత్తం రాబడు లను రూ.30,42,230 కోట్లుగా అంచనా వేశారు. ఇందులో నికర పన్ను ఆదాయం (కేంద్రం వాటా) రూ. 16,35,909 కోట్లు, పన్నేతర ఆదాయం రూ. 3,85,017 కోట్లుగా అంచనా వేశారు.అలాగే పెట్టుబడి రాబడులలో ప్రధానమైన వనరు అప్పు లు రూ.7,96,337 కోట్లుగా అంచనావేసినా ఈ వార్షిక అప్పులు రూ. పది లక్షల కోట్లకుచేరుకుంటాయి.ఇక వ్యయానికి వస్తే బడ్జెట్‌ వ్యయం రూ. 30,42,230 కోట్లుగా అంచనా వేయబడింది.

ఇందులో రెవెన్యూ ఖర్చు రూ.26,30,145 కోట్లుకాగా పెట్టుబడి ఖర్చు రూ.4,12,085 కోట్లు. రెవెన్యూ ఖర్చులో ప్రధానంగావడ్డీ రూ. 7,08,203 కోట్లు. ఇది ప్రతిసంవత్సరం పెరుగుతుంది. ఎందుకంటే అప్పులు ప్రతి ఏటా పెరుగుతున్నాయి. ఆస్తులు సమ కూర్చుకోవడానికి గ్రాంట్స్‌గా రూ.2,06,500 కోట్లు అంచనా వేశారు.ఎవరి ఆస్తులు?అదే ప్రశ్న ఉత్పన్నం అవ్ఞతుంది కదా. ఈ గ్రాంట్స్‌ పెట్టుబడిదారుల ఆస్తుల కోసం రెవెన్యూలోటును రూ. 6,09,219 కోట్లుగా, ద్రవ్యలోటును రూ. 7,96,337 కోట్లుగా అంచనా వేశారు. ఈ ద్రవ్యలోటు పెట్టుబడి రాబడులలో పేర్కొ న్న అప్పులకు సమానమని గ్రహించగలరు.

కనుక అప్పులు పెరి గితే ద్రవ్యలోటు కూడా ఆ మేరకు పెరుగుతుంది. పోయిన రెండు బడ్జెట్‌లాగానే ఈ బడ్జెట్‌లో కూడా మొత్తం పన్ను ఆదాయాన్ని రాబడుల కింద చూపించారు. కేంద్ర ప్రభుత్వానికి వచ్చే నికర పన్ను ఆదాయాన్ని మాత్రమే చూపిస్తున్నారు. రాష్ట్రాలకు రావల సిన 42శాతం పన్ను బదలాయింపును(వాటాను)బడ్జెట్‌లో చూపిం చకుండా,దానిని బడ్జెటేతర అంశంగా పరిగణిస్తున్నారు.

ఇది రాజ్యాంగ విరుద్ధం, ప్రభుత్వ బడ్జెట్‌ మాన్యువలుకు ఆర్థిక చట్టా నికికూడా విరుద్ధం. పన్ను ఆదాయం 42 శాతం బదలాయింపులో కేంద్రం కొన్ని రాష్ట్రాలకు తక్కువగాను,మరికొన్ని రాష్ట్రాలకు ఎక్కు వగాను పన్ను ఆదాయాన్ని పంపకం చేస్తూ వివక్షను చూపిస్తున్న ది. ఉదాహరణకు ప్రస్తుతం 2019-20 బడ్జెట్‌లో కేంద్రానికి రావలసిన మొత్తం పన్నుఆదాయంలో దాదాపు రూ.3.0 లక్షల కోట్ల పన్నుఆదాయం రాలేదు.రాష్ట్రాలకు పన్ను బదలాయింపు బడ్జెటేతర అంశంగా రూ. 8,10,000 కోట్లుగా అంచనా వేశారు.

పన్ను ఆదాయం తగ్గిందికాబట్టి బదలాయింపును రూ. 6,56, 000 కోట్లకు కుదించింది. అంచనాల ప్రకారం ఆదాయం పన్ను వసూళ్లు జరగలేదు. కాబట్టి కేంద్రం కూడా రూ. 88,000 కోట్ల్లమేరకు ఖర్చును కుదించుకుంది. అయితే 15వ ఆర్థికసంఘం 42 శాతం బదలాయింపును 41 శాతానికి కుదించింది. కనుక పన్ను బదలాయింపు శాతాలలో స్వల్పంగా కోత ఏర్పడుతుంది. పూర్తి స్థాయి నివేదికను అక్టోబరులో ఇస్తారంటా! తాత్కాలిక నివేదికను 2019 డిసెంబర్‌ ఇచ్చింది ఆర్థిక సంఘం ఛైర్మన్‌.రాజ్యాంగ చట్టం ప్రకారం పన్ను విధింపులు ఎక్కువగా కేంద్ర పరిధిలోనే ఉన్నాయి. చివరకు పరోక్షపన్నులన్నీ ఏకం చేసి జిఎస్టీని కూడా కేంద్రానికే అప్పచెప్పారు.కేంద్ర పరిధిలో ఉన్న జిఎస్టీ కౌన్సిల్‌ నిర్ణయిస్తుంది. జిఎస్టీ కోసం రాజ్యాంగ చట్టానికే సవరణలు చేశారు.

ఇప్పుడు సంవత్సరంలో వచ్చే ఆదాయం కంటే వ్యయం ఎక్కువగా ఉంటే ఆ తేడానే ద్రవ్యలోటు అంటారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2019 ఏప్రిల్‌-డిసెంబర్‌ నెలల మధ్య ద్రవ్యలోటు రూ. 9,32,000 కోట్లుగా నమోదైంది. ఆర్థిక సంవత్సరం ముగిసే 2020మార్చి నాటికి ఈ ద్రవ్యలోటు సుమారు 11 లక్షల కోట్లకు చేరుకుంటుంది. 2019 జులై నెలలో పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టినప్పుడు ద్రవ్యలోటును రూ. 7,03,000 కోట్లుగా అంచనా వేసుకున్నారు.

గతంలో ఇంత భారీగాద్రవ్యలోటు ఎన్నడూ ఏర్పడ లేదు. అందుకు కారణం కేంద్రప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు అను సరిస్తున్న ఆర్థికవిధానాలే.గడచిన తొమ్మిది నెలలకాలానికి రెవెన్యూ ఆదాయం రూ. 11,46,000 కోట్లు మాత్రమే సమకూరగా, అదే కాలానికి వ్యయం రూ. 21,09,000 కోట్లు. ఫలితంగా మొదటి తొమ్మిది నెలల కాలానికి ద్రవ్యలోటు రూ. 9,32,000 కోట్లుగా నమోదైంది. ప్రతి సంవత్సరం వృద్ధిరేటు క్షీణిస్తున్నది. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తున్నది కాబట్టి. గడచిన 2018-19ఆర్థిక సంవ త్సరంలో ప్రాథమికరంగమైన వ్యవసాయరంగం కేవలం ఒకశాతం వృద్ధిరేటును సాధించింది.

రెండవ రంగమైన పారిశ్రామిక రంగం ఆరుశాతం,మూడవ రంగమైన సేవారంగం ఎనిమిదిశాతం వృద్ధిని సాధించాయి. వ్యవసాయరంగం అభివృద్ధికాకపోతే మిగతా రెండు రంగాలు కూడా అభివృద్ధి కానేకావ్ఞ. దేశంలో వ్యవసాయానికి యోగ్యమైన భూమి 74 కోట్ల ఎకరాలకుపైగానే ఉంది. కాని సాగు చేయబడుతున్న భూమి 40కోట్ల ఎకరాలే.

మిగతా 34 కోట్లు ఎక రాల భూమిని బీడుభూములుగా ఎందుకు ఉంచారు? 2004- 2019 మధ్యకాలంలో వ్యవసాయాభివృద్ధికోసమని రూ.90 లక్షల కోట్ల పంటరుణాలను బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు వ్యవసాయ సహకార సంఘాల ద్వారా మంజూరు చేశారు.ఈ బడ్జెట్‌లో కూడా రూ.15 లక్షల కోట్లు పంట రుణాలుగా ఇస్తామని చాలా స్పష్టంగా చెప్పారు. వ్యవసాయ అభివృద్ధి ఎక్కడ జరిగింది? వ్యవసాయ రుణాలను పొందిన భూస్వాములు ఆ డబ్బుతో ఇతర వ్యాపారాలు చేసుకొంటున్నారు.

మరికొందరు గ్రామీణ ప్రాంతాల్లో రుణదాతలుగా చెలామణి అవ్ఞతున్నారు. వ్యవసాయం అభివృద్ధిచెందాలంటే మొదటి షరతుఏమంటే ‘దున్నేవాడికే భూమి ప్రాతిపదికన భూ సంస్కరణలు చేపట్టాలి. పాలకులు బడ్జెట్‌లో వ్యక్తిగత ఆదాయం పన్నురేట్లను ఏడు శ్లాబుల్లో ప్రతిపాదించారు. వాటికి బదులుగా ఐదు శ్లాబుల్లో పన్నురేట్లను ప్రతిపాదించవచ్చు.0-5లక్షలు పన్ను లేదు, ఐదు లక్షలుపైన 10లక్షల లోపల పదిశాతం,పదిలక్షల పైన 15 లక్షల లోపు 15శాతం,15లక్షలపైన 20లక్షల లోపు20శాతం, 20 లక్షలపైన ఉన్నట్లయితే30శాతం ఉండాలి.ప్రభుత్వం ప్రతిపా దించిన రేంజీలు తక్కువగా ఉన్నాయి. ఉదాహరణకు 5-7.5 లక్షలు,7.5-10 లక్షలు, పది లక్షలు-పదిహేను లక్షలు తదితర అన్ని శ్లాబుల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు మిగతా మధ్యతరగతి ప్రజానీకం తదితరులు రెండులేక మూడు సంవత్స రాలకే వార్షికఆదాయం పెరిగి వెంటవెంటనే పైశ్లాబుల్లోకి ప్రవేశిస్తా రు. పది సంవత్సరాలకే చివరి శ్లాబు 30 శాతం పన్నురేటుకు అందరూ చేరుకుంటారు.దేశంలో కొత్తగా పెట్టుబడులు పెట్టే కంపె నీలకు కార్పొరేట్‌ పన్నును 15శాతానికి తగ్గించారు.

గత సంవత్స రం కార్పొరేట్‌ పన్నును ప్రభుత్వం 34శాతం నుండి 22శాతానికి తగ్గించిన విషయం తెలిసిందే. ఈ తగ్గింపును కొనసాగిస్తామని బడ్జెట్‌లో పునరుద్ఘాటించారు. ఇదివరకు 15శాతం డివిడెండ్‌ పన్నును కంపెనీలే తమ లాభాల నుంచి భరించేవి. అయితే ఈ బడ్జెట్‌ ప్రకారం ఆ 15శాతం డివిడెండ్‌ పన్నును ఎవరైతే డివిడెం డును పొందుతారో వారే భరించాలి.కంపెనీలు చెల్లించే విధానాన్ని రద్దుచేశారు. కార్పొరేట్‌ పన్నును 40శాతానికి పెంచారు.

వ్యక్తిగత ఆదాయం పన్ను గరిష్ఠంగా 30శాతం ఉండగా కార్పొరేటు పన్ను గరిష్ఠంగా 22 శాతమే. 1991లో అనుకూల ఆర్థిక విధానాలను ప్రవేశపెట్టిన తర్వాత విదేశీ పెట్టుబడుల ప్రవాహం దేశంలోకి ఊపందుకొంది.ఇప్పటివరకు దాదాపు రూ. 70 లక్షల కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు,రూ.15లక్షల కోట్ల విదేశీపరోక్ష పెట్టుబడులు వచ్చాయి.

గత పది సంవత్సరాల కాలంలోనే విదేశీ ప్రత్యక్ష పెట్టు బడులు రూ.33.18 లక్షల కోట్లువచ్చాయి. మౌలికరంగ వసతుల కల్పనకు అవసరమైన 6,500ప్రాజెక్టులలో ప్రైవేట్‌ భాగస్వామ్యం తో కలిసి రూ.103లక్షల కోట్లు పెట్టుబడులుగా పెట్టి మౌలికరం గాన్ని అభివృద్ధి చేస్తామని బడ్జెట్‌ ప్రసంగంలో చెప్పారు.గత కొన్ని సంవత్సరాలలో ప్రభుత్వం పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంకుల్లో 3,50,000 కోట్లు పెట్టుబడులుగా పెట్టింది.

అయితే గత ఆరు సంవత్సరాలలో ప్రభుత్వ బ్యాంకులకు రావలసిన రూ. 13 లక్షల కోట్లలో దాదాపు రూ.ఐదు లక్షలకోట్ల మొండిబకాయిలను ప్రభుత్వం మాఫీచేసింది. అయినను ఇంకా రూ. 8 లక్షల కోట్ల మొండిబకాయిలు వసూలు కావాలి.వీటికి నిరర్థక ఆస్తులుగా పేరు పెట్టుకున్నారు. ఆరోగ్యరం గానికి రూ. 69000 కోట్లు కేటాయించారు.

ఈ కేటాయింపును సద్వినియోగం చేసుకోవాలంటే ప్రభుత్వం దేశంలోని అన్ని జిలా ్లకేంద్రాలలో ఉన్నతస్థాయి ఆస్పత్రులను తగిన వైద్యసిబ్బందితో, తగువసతులతో యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేసి ప్రజల ఆరోగ్యా నికి భరోసా కల్పిస్తూ వాటి నిర్వహణకు ఏటా అవసరమైన నిధులను బడ్జెట్లో కేటాయించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి.

  • వి.జయరాముడు

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/