నిర్మలమ్మ బడ్జెట్‌ ప్రసంగం ప్రారంభం

YouTube video
Union Budget 2021-22: Live from Parliament

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2021-22 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. మేడిన్‌ ఇండియా ట్యాబ్‌లో పొందుపరిచిన బడ్జెట్‌ ప్రసంగాన్ని చదవడం ప్రారంభించారు. కాగా, నిర్మల బడ్జెట్‌పై పలు వర్గాలు ఆశలు పెంచుకున్న క్రమంలో ఎలాంటి వరాలు, రాయితీలు కురిపిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇక కొవిడ్‌తో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థలో ఉత్తేజం నింపేందుకు ఎలాంటి ఉద్దీపన ప్యాకేజ్‌లు ప్రకటిస్తారని పరిశ్రమ వర్గాలు ఉత్కంఠగా వేచిచూస్తున్నాయి.


అంతకముందు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఓ కాపీని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు అందించారు. ఈ ఉదయం రాష్ట్రపతి నివాసానికి తన టీమ్ తో కలిసి వెళ్లారు. దాదాపు పావుగంట సేపు రాష్ట్రపతితో భేటీ అయి, బడ్జెట్ విశేషాలను పంచుకుని, అక్కడి నుంచి నేరుగా పార్లమెంట్ చేరుకున్నారు. అప్పటికే అక్కడికి మోడి సహా, ఇతర క్యాబినెట్ మంత్రులు చేరుకోగా, బడ్జెట్ ను క్యాబినెట్ ముందుంచి, ఆమోదం తీసుకున్నారు. ఆ వెంటనే 2021-22 వార్షిక బడ్జెట్ కు కేంద్రం ఆమోదించినట్టు ప్రకటన వెలువడింది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/