దేశ ఆర్థిక వ్యవస్థపై ఎవరూ నిరాశపడనవసరం లేదు

prakash javadekar
prakash javadekar

న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్2020లో దేశంలోని ఆర్థిక మందగమనాన్ని సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళిక ఉంటుందని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ సూచనప్రాయంగా తెలిపారు. భారత ఆర్థిక వ్యవస్థపై ఎవరూ నిరాశపడనవసరం లేదని, దేశ ఆర్థిక పునాదులు బలంగా ఉన్నాయని ఆయన అన్నారు. 2019లో భారత వృద్ధి రేటు 4.8 శాతానికి తగ్గుతుందని ఐఎంఎఫ్ అంచనా వేసిన నేపథ్యంలో మంత్రి మాటలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఫిబ్రవరి 1న బడ్జెట్ సమర్పణకు కేంద్ర ఆర్థిక శాఖ సన్నాహాలు చేస్తోంది. షెడ్యూల్ ప్రకారం, జనవరి 31న పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమై ఏప్రిల్ 3తో ముగుస్తాయి. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెడతారు. ఆమె పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టనుండటం ఇది రెండోసారి.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/