బొత్స మీద ఫైర్‌ అయిన బుద్ధా వెంకన్న

Buddha Venkanna
Buddha Venkanna

గుంటూరు: రాజ్యాంగ దినోత్సవ వేడుకలు కేశినేని భవన్‌లో టిడిపి నేతలు, కార్యక్తలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిడిపి అర్బన్‌ అధ్యక్షుడు బుద్ధా వెంకన్న, మాజీ మేయర్‌ కోనేరు శ్రీధర్‌, మాజీ డిప్యూటీ మేయర్‌ గోగుల రమణారావు మరియు టిడిపి నేతలు బి.ఆర్‌.అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం బుద్ధా వెంకన్న మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికీ ప్రాధమిక హక్కులు ఉండాలని కోరుకున్న వ్యక్తి అంబేద్కర్‌ అని కొనియాడారు. అంతేకాదు అంబేద్కర్‌ రూపొందించిన రాజ్యాంగం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమన్నారు. అంతేకాకుండా మంత్రి బొత్స సత్యనారాయణను తీవ్రంగా విమర్శించారు. అమరావతిని శ్మశానం అంటున్నారని, అయితే వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యె ఆ శ్మశానంలో ఎలా గెలిచిందో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. మంత్రివర్గ సమావేశాలు శ్మశానంలోనే జరుపుతున్నారా? అని బుద్ధా నిలదీశారు. ఒక్క అమరావతిని మాత్రమే కాదు.. మొత్తం ఏపినే శ్మశానం మారుస్తున్నారని ఆయన ఫైర్‌ అయ్యారు. బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు చూస్తుంటే రాష్ట్రాన్ని రాక్షసులు పాలిస్తున్నారా? అనిపిస్తుందన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/