విజయసాయిరెడ్డిపై బుద్ధా వెంకన్న విమర్శలు

ఒక కోతి స్వయంగా కోతి సామెతలు చెప్పుకోవడం ఎప్పుడూ చూసి ఉండం.. బుద్ధా వెంకన్న

buddha venkanna
buddha venkanna

అమరావతి: తాచెడ్డ కోతి వనమెల్ల చెరిచిందనే సామెత చంద్రబాబుకు సరిగ్గా సరిపోతుందని వైఎస్‌ఆర్‌సిపి ఎంపి విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించడం తెలిసిందే. ప్రజలు ఓడించినా అడ్డదారిన సిఎం అవ్వాలనుకునే రీతిలో భ్రమపడుతున్నాడని విమర్శించారు. దీనిపై టిడిపి ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఘాటుగా స్పందించారు. ఒక కోతి స్వయంగా కోతి సామెతలు చెప్పుకోవడం బహుశా ఎప్పుడూ చూసి ఉండం అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. తండ్రి శవం పెట్టుబడిగా సంతకాలు సేకరించి దొడ్డిదారిన సీఎం అవ్వాలి అనుకున్న విషయం మర్చిపోతే ఎలా? అని ప్రశ్నించారు. వ్యవస్థలను భ్రష్టు పట్టించి 16 నెలల పాటు ఊచలు లెక్కపెట్టిన నాడు ఈ విలువలు గుర్తురాలేదా? అని నిలదీశారు. బురదలో ఉన్న పందికి బురద పాండ్స్ కంపు రావడం భ్రమే అని బుద్ధా వెంకన్న వ్యాఖ్యానించారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/