ప్రజలు కోరుకున్న హోదా మాటేమిటి?

విజయసాయి రెడ్డికి బుద్దా కౌంటర్

buddha venkanna
buddha venkanna

అమరావతి: వైఎస్‌ఆర్‌సిపి కోరుకున్నవన్నీ ప్రజలు ఇచ్చారని, కానీ ప్రజలు కోరుకున్న ప్రత్యేక హోదాను ప్రభుత్వం ఎప్పుడు తెస్తుందని టిడిపి నేత బుద్దా వెంకన్న ప్రశ్నించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, ‘ఒకటి నుండి మొదలైన వైఎస్‌ఆర్‌సిపి రాజ్యసభ ప్రస్థానం 11కి చేరుతుంది అని ఎంపీ విజయసాయి రెడ్డి సెలవిచ్చారు. మీరు కోరుకున్న ప్రతిదీ ప్రజలు మీకిచ్చారు అని చెబుతున్నారు సరే, మరి ప్రజలు కోరుకున్న ప్రత్యేక హోదా మాటేమిటి? త్వరగా తెచ్చేయండి. లేకపోతే లావైపోతారు!!’ అని అన్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/