విజయసాయి రెడ్డికి తెలియకపోవడం ఆశ్చర్యకరం

Buddha Venkanna
Buddha Venkanna

అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబుకు మరో ఆరు నెలల్లో ప్రతిపక్ష నాయకుడి హోదా ఉంటుందో ఊడుతుందో చెప్పలేని పరిస్థితి ఉందని వైఎస్‌ఆర్‌సిపి ఎంపి విజయసాయి రెడ్డి విమర్శించిన విషయం తెలిసిందే. కాగా ఈ విషయమై స్పందించిన టిడిపి నేత బుద్ధా వెంకన్న.. చంద్రబాబు గారికి ప్రతిపక్ష హోదా ఉండదు అని చిలక జోస్యం చెప్పిన విజయసాయిరెడ్డి గారికి మరో మూడు నెలల్లో జగన్‌ గారు జైలుకి పోతారని, తన ముఖ్యమంత్రి పదవి ఊడిపోవడం ఖాయమని తెలియకపోవడం ఆశ్చర్యకరం అని ఆయన ట్వీట్‌ చేశారు. ఈ విషయాన్ని పసిగట్టినట్లు ఉన్నారు పాపం వైఎస్‌ఆర్‌సిపి ఎంపీలు, ఎమ్మెల్యేలు, అందుకే బిజెపిలో దూకడానికి సిద్ధంగా ఉన్నారట. అందుకే మీరు, జగన్‌గారు ఢిల్లీలో తలవంచుకుని నిలబడుతున్నారంటగా అంటూ తనదైన రీతిలో చురకలంటించారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business