విజయసాయిరెడ్డిపై బుద్దా వెంకన్న విమర్శలు

విశాఖలో ఎందుకు ట్రీట్ మెంట్ తీసుకోలేదన్న బుద్ధా

MLC Budda Venkanna
MLC Budda Venkanna

అమరావతి: టిడిపి నేత బుద్దా వెంకన్న వైఎస్‌ఆర్‌సిపి ఎంపి విజయసాయిరెడ్డిపై విమర్శలు గుప్పించారు. కరోనా పాజిటివ్ వచ్చిన విజయసాయి రెడ్డి, హైదరాబాద్ లో చికిత్స పొందుతుండటంపై వెంకన్న సెటైర్లు వేశారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేస్తూ, ‘అదేంటి హైదరాబాద్ పారిపోయారా?కార్పొరేట్ ఆసుపత్రిలో చేరారా? విజయసాయి రెడ్డి గారు. ఓహో అల్లుడు పాలన మీద నమ్మకం లేదా? గుండ్రాయిలా ఉన్న అచ్చెన్నకి కార్పొరేట్ వైద్యం ఎందుకు ఈఎస్ఐ ఉండగా అని ఒక బిసి నాయకుడిని అవమానిస్తూ మీ రాక్షస మనస్తత్వం బయటపెట్టారు’ అని అన్నారు. ఆపై, ‘మరి మీరు విశాఖ లో కేజీహెచ్ ట్రీట్మెంట్ తీసుకోకుండా ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వెళ్లడం ఏంటి?అన్నట్టు ఇది కరోనా పాజిటివా?వివేకా గారి కేసులో సీబీఐ పాజిటివా?ఆయన హత్యకు గురైనప్పుడు మీరు సంభ్రమాశ్చర్యాలకు గురైయ్యారు గుర్తుందా?’ అని సెటైర్లు వేశారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/