మంత్రి అమర్నాథ్ పై టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగజగదీష్ ఆగ్రహం

ఏపీలో రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. వైసీపీ vs టీడీపీ, జనసేన గా మారింది. ఒకరిపై ఒకరు అవకాశం దొరికినప్పుడల్లా మాటల యుద్ధం చేస్తున్నారు. తాజాగా వైసీపీ మంత్రి అమర్ నాధ్ ఫై టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగజగదీష్ కీలక ఆరోపణలు చేసారు. అనకాపల్లి అభివృద్ధి కోసం ప్రశ్నిస్తే మంత్రి వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని ఆయన మండిపడ్డారు. బినామీలతో అవినీతికి పాల్పడుతూ మంత్రి నీతి కబుర్లు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు.

విసన్నపేటలో భూములు కబ్జా, క్వారీలలో అక్రమాలు , ఆర్ఇసిఎస్ లో కుంభకోణం పాల్పడింది మంత్రే అంటూ నాగజగదీష్ ఫైర్ అయ్యారు. నా మీద కక్ష తో నా కొడుకు పై అక్రమ కేసులు పెట్టించావు అంటూ ఆయన ధ్వజమెత్తారు. అమర్నాథ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బినామీ మంత్రివి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలు వ్యతిరేకంగా వైసీపీ ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరికి ప్రజలే రానున్న రోజుల్లో తగిన బుద్ది చెబుతారన్నారు.