సముద్రపు అంచులలోకి వెళ్లి ఎమ్మెల్సీ కవిత కు విషెష్ తెలిపిన అభిమాని

తమ అభిమాన నేతలకు , సినీ స్టార్స్ తమదైన రీతిలో పుట్టిన రోజు విషెష్ చెపుతుంటారు. కొంతమంది భారీ ప్లెక్సీ , కట్ ఔట్స్ ఏర్పాటు చేసి అభిమానం చాటుకుంటే..మరికొంతమంది పలు సేవ కార్యక్రమాలు చేపట్టి అభిమానాన్ని చాటుకుంటారు. తాజాగా ఎమ్మెల్సీ కవిత అభిమాని మాత్రం పెద్ద సాహసమే చేసారు. ఈరోజు కవిత పుట్టిన రోజు సందర్బంగా నిజామాబాద్‌కు చెందిన బీఆర్ఎస్ నాయకుడు చిన్ను గౌడ్ వినూత్నంగా శుభాకాంక్షలు తెలియజేసి తన అభిమానాన్ని చాటుకున్నాడు. అండమాన్ నికోబార్ దీవుల్లో బంగళా ఖాతం సముద్రపు అంచులలోకి వెళ్లి మరీ విషెస్ చెప్పాడు.

ఇతరులు ఎమ్మెల్సీ కవితకు జన్మదిన శుభాకాంక్షలతో కూడిన బ్యానర్లను ప్రదర్శించారు. బంగాళాఖాతంలో నీటి అడుగున డైవింగ్ చేస్తూ చిన్నూగౌడ్ బ్యానర్లను ప్రదర్శించడం అనేది ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీనికి సంబంధించిన వీడియోను టీస్ ఫుడ్స్ చైర్మెన్ మేడే రాజీవ్ సాగర్ చేతుల మీదుగా ఆదివారం రాత్రి 12 గంటలకు విడుదల చేశారు.

ఇక రీసెంట్ గా కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ ముందు హాజరయ్యారు. దాదాపు 09 గంటలపాటు ప్రశ్నించిన అధికారులు..మార్చి 16 న మరోసారి హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసారు.