స్వీట్లు పంచుకున్న భారత్‌, పాకిస్థాన్‌ జవాన్లు

BSF-Soldiers
BSF-Soldiers

అట్టారీ: రంజాన్‌ పండుగ సందర్భంగా పంజాబ్‌లోని అట్టారీ-వాఘా సరిహద్దుల్లో భారత్‌, పాకిస్థాన్‌ జవాన్లు మిఠాయిలు పంచుకున్నారు. అయితే ఇరు దేశాల జాతీయ, మతపరమైన పండగల సందర్భంగా రెండు దేశాలకు చెందిన జవాన్లు ఇలా స్వీట్లు పంచుకోవడం ఆనవాయితీగా వస్తోంది.భారత్‌కు చెందిన సరిహద్దు భద్రతా సిబ్బంది (బీఎస్‌ఎఫ్‌), పాకిస్థాన్‌ రేంజర్లు ఒకరికొకరు స్వీట్లు పంచుకున్నారు. పాకిస్థాన్‌ వింగ్‌ కమాండర్‌ ఉస్మాన్‌ అలీ.. భారత బీఎస్‌ఎఫ్‌ కమాండెంట్‌ ముకుంద్‌ కుమార్‌ ఝా కు స్వీట్లు అందజేశారు. అనంతరం ఇరువురు కరచాలనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకొన్నారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/