Auto Draft

లాభాల్లో ముగిసిన సెన్సెక్స్‌, నిఫ్టీ

Sensex ends in gains, Nifty

ముంబై: దేశీయస్టాక్‌ మార్కెట్లు బౌన్స్‌బ్యాక్‌ అయ్యాయి. మొదట కొంతమేర ఆటుపోట్లకు గురైనా తర్వాత జోరందుకున్నాయి.

చివరికి సెన్సెక్స్‌ 377 పాయింట్స్ పెరిగి 40,522వద్ద స్థిరపడగా, నిప్టీ కూడా 122 పాయింట్లు పెరిగి 11,889 వద్ద నిలిచింది.

అయితే మొదట 39,978వరకూ నీరసించిన సెన్సెక్స్‌ ఒకదశలో 40,556వరకూ పెరిగింది.

ఎన్‌ఎస్‌ఇలో ముఖ్యంగా ప్రైవేట్‌ బ్యాంకులు 3.2శాతం పెరిగింది. అదేవిధంగా ఫార్మా, ఎఫ్‌ఎంసిజి, మీడియా, ఆటో 1.5శాతం స్థాయిలో పుంజుకున్నాయి.

అయితే ఐటి, పిఎస్‌యు బ్యాంకులు, రియాల్టీ 1.2శాతం నుంచి 0.7శాతం మధ్య క్షీణించాయి.

నిఫ్టీ దిగ్గజాలలో ఇండస్‌ ఇండ్‌ బ్యాంకు 12శాతం పెరగ్గా, నెస్లే ఇండియా, ఏసియన్‌ పెయింట్స్‌, శ్రీ సిమెంట్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఎన్‌టిపిసి, దివీస్‌, సిప్లా, ఎల్‌అండ్‌టి, యాక్సిస్‌ బ్యాంకు, డాక్టర్‌ రెడ్డీస్‌, బ్రిటానియా, టాటా మోటార్స్‌, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు 6నుంచి 2శాతం మధ్య పుంజుకున్నాయి.

హెచ్‌డిఎఫ్‌సి, టిసిఎస్‌, ఒఎన్‌జిసి, ఇన్ఫోసిస్‌, విప్రో, గెయిల్‌ ఇండియా, ఎస్‌బిఐ, బజాజ్‌ ఫిన్‌, ఐటిసి, సన్‌ ఫార్మా 2నుంచి ఒక శాతం మధ్య నీరసించాయి.

ఎంఆర్‌ఎఫ్‌, ఎసిసి, శ్రీరామ్‌ ట్రాన్స్‌, కాల్గేట్‌, జీ, టాటా కన్జూమర్‌, ముత్తూట్‌ పైనాన్స్‌, ఐజిఎల్‌, అంబుజా సిమెంట్స్‌, అశోక్‌ లేలాండ్‌, ఆర్‌ఇసి, రామ్‌కో, దివీస్‌, పిడిలైట్‌, అమరరాజా, కంకార్‌ 8 నుంచి 3శాతం మధ్య పెరిగాయి.

ఎంఅండ్‌ఎం ఫైనాన్స్‌, పివిఆర్‌, సెయిల్‌, యుబిఎల్‌, భారత్‌ ఫోర్జ్‌, ఐడియా, ఇండిగో, టొరంట్‌ ఫార్మా, ఐబి హౌసింగ్‌ 4నుంచి 1.6శాతం మధ్య పడిపోయాయి.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/