బీఎస్-6 ప్రమాణాలతో బజాజ్ సీటీ, ప్లాటినా మార్కెట్లోకి..

న్యూఢిల్లీ: భారత్ స్టేజ్(బీఎస్)6 ప్రమాణాలతో తయారు చేసిన సీటీ, ప్లాటినా మోటార్ సైకిళ్లను మార్కెట్లోకి విడుదల చేసినట్లు బజాజ్ ఆటో ప్రకటించింది. బీఎస్6 సీటీ మోడల్ రెండు ఇంజిన్ (100 సీసీ, 110 సీసీ) ఆప్షన్లలో లభించనున్నాయి. వీటి ప్రారంభ ధరను రూ.40,794గా నిర్ణయించింది సంస్థ. బీఎస్6 ప్లాటినా వాహనం కూడా రెండు వేరియంట్ల(100సీసీ, 110 సీసీ హచ్‌గేర్)లో లభించనుంది. వీటి ధర రూ.47,264 నుంచి ప్రారంభమవుతుంది. ఇక ప్లాటి నా 100 ఎలక్ట్రిక్ స్టార్ట్ రేటు 54,797 రూపాయలు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/