విశ్వాస పరీక్షలో నెగ్గిన యడియూరప్ప ప్రభుత్వం

యడ్డీ విజయం లాంఛనమైంది

Yediyurappa
Yediyurappa

బెంగళూరు: విశ్వాస పరీక్షలో కర్ణాటక సిఎం యడియూరప్ప ప్రభుత్వం నెగ్గింది. బిజెపికి మద్దతుగా 106 ఓట్లు పడ్డాయి. మ్యాజిక్‌ ఫిగర్‌ కంటే రెండు ఓట్లు అదనంగా రావడంతో యడియూరప్ప బలపరీక్షలో గెలుపొందారు. మూజువాణి ఓటు ద్వారా ఆయన విశ్వాస పరీక్షలో నెగ్గినట్లు స్పీకర్‌ ప్రకటించారు. 17 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడటంతో సభలోని సంఖ్య 207 కు చేరింది. బల పరీక్షలో నెగ్గేందుకు మేజిక్‌ ఫిగర్‌ 104. సొంత పార్టీ బలం 105తో పాటు ఒక స్వతంత్ర అభ్యర్థి మద్దతివ్వడంతో యడ్డీ విజయం లాంఛనమైంది.
అయితే విశ్వాస పరీక్షలో నెగ్గిన యడియూరప్ప ప్రభుత్వం స్పీకర్‌గా రమేష్ కుమార్‌ను కొనసాగిస్తుందా లేక కొత్త స్పీకర్‌ను నియమించుకుంటుందా అన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/