బిఎస్‌-6 నిబంధనావళి వాయిదా వేయాలి

ఆటోమొబైల్‌ డీలర్ల సంఘాలు

Automobile Dealers Associations
Automobile Dealers Associations

ముంబయి : ఆటోమొబైల్‌ రంగంలో ఉత్పత్తిదారులకు బిఎస్‌-6 ఉద్గారాలనిబంధనలు వాయిదా వేయనిపక్షంలో ఆటోమొబైల్‌ కంపెనీలు ఈ వ్యాపారంనుంచి బైటికి వెళ్లిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయని కలవరం వ్యక్తం అవుతోంది. 2020 ఏప్రిల్‌ ఒకటవ తేదీనాటికి మొత్తం పాతవాహనాలను పూర్తిగా విక్రయించుకోవాల్సి ఉంటుంది. అనేక మంది కార్‌డీలర్లు ఆర్థికపరంగా చిక్కులు ఎదుర్కొంటున్నారు. దక్షిణాసియా దేశంలోని డీలర్లు ఎక్కువగా ఏప్రిల్‌ తర్వాత పాత కార్లను విక్రయించేందుకు అనుమతించడంలేదని ఆటోమొబైల్‌ డీలర్లసంఘాల సమాఖ్య చెపుతోంది. ఇదేకొనసాగితే ఈ వ్యాపారంమానుకోవాల్సిన పరిస్థితులు ఉత్పన్నం అవుతాయని చెపుతున్నారు. తాజా కర్బన ఉద్గారాలనిబంధనలు అమలుకు రావడంతో ఫిబ్రవరినుంచే అమలుకు వస్తాయని దీనివల్ల కొంతమేర వాయిదావేస్తే తమ వద్ద ఉన్న పాతకార్లను విక్రయించుకోగలమని చెపుతున్నారు. భారత్‌ స్టేజ్‌-6 నిబంధనలున్న వాహనాలను ఏప్రిల్‌తర్వాతనుంచి అమ్మాల్సి వస్తుంది. వీటికితోడు కోర్టుసమస్యలు కూడా ఎదురవుతాయని కస్టమర్లు కొనుగోలుచేయరని ఈ దృష్ట్యా ఈ నిబంధనను మరికొంతకాలం వాయిదా వేయనిపక్షంలో కార్‌ డీలర్‌ వ్యాపారనుంచి విరమించుకునే దుర్భరపరిస్థితులు ఏర్పడతాయని చెపుతున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/