ఇరాన్‌ అధ్యక్షుడి సోదరుడికి ఐదేళ్ల జైలు శిక్ష

hassan rouhani and his brother
hassan rouhani and his brother

ఇరాన్ : ఇరాన్‌ అధ్యక్షుడు హస్సన్‌ రౌహాని సోదరుడికి అవినీతికి పాల్పడిన కేసులో ఐదేళ్ల జైలు శిక్ష విధించారు. మరొక నలుగురికి అమెరికా, బ్రిటన్‌ల కోసం గూఢచర్యానికి పాల్పడినందుకుగాను శిక్ష విధించారు. వారిలో ఒకరికి ఉరిశిక్ష విధించారు. దీనితో అవినీతిని రూపుమాపుతానంటూ ఎన్నికల్లో వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన రహౌనీ తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. రహౌనీ సోదరుడు హొస్సేన్‌ ఫెరీడౌన్‌ను 2017లో అరెస్టు చేశారు.


తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/