న్యూయార్క్ లో కాల్పుల కలకలం

మరోసారి అమెరికా కాల్పులతో దద్దరిల్లింది. న్యూయార్క్ నగరంలోని బ్లూక్లిన్‌లో ఉన్న సబ్‌వేలో మంగళవారం సాయంత్రం ఒక వ్యక్తి ఉన్నట్లుండి కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో పదమూడు మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. కాగా, నిందితుడు నిర్మాణ రంగ కార్మికుడిలా డ్రెస్ చేసుకుని ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. సన్‌సెట్ పార్క్ పరిసరాల్లోని 36వ స్ట్రీట్ స్టేషన్‌లో నుంచి పొగలు రావడం గమనించిన అగ్నిమాపక సిబ్బంది… ఆతరువాత కాల్పులు జరిగాయని నిర్థారించుకున్నారు.

నిత్యం రద్దీగా వుండే సబ్​వే లో కాల్పులతో అంతా రక్తసిక్తమైందని పోలీసులు తెలిపారు. ఇప్పటివరకు ఎంతమంది మరణించారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదని తెలిపారు.ఈ కాల్పుల్లో ఆరుగురు మరణించగా, 13 మంది తీవ్రంగా గాయపడ్డట్లు చెపుతున్నారు. అయితే, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. దీన్ని ఉగ్రదాడిగా అధికారులు అనుమానిస్తున్నారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు.