క‌రోనా ఆంక్ష‌లు ఎత్తివేత : ప్ర‌ధాని బోరిస్ జాన్స‌న్

లండన్: క‌రోనా విజృంభిస్తోన్న వేళ గ‌త రెండేళ్ల నుంచి ప‌లు కంపెనీలు వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ స‌దుపాయాన్ని క‌ల్పించాయి. అయితే ఈ ఆంక్ష‌ల‌ను ఎత్తివేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు బ్రిటీష్ ప్ర‌ధాని బోరిస్ జాన్స‌న్. క‌రోనా, కొత్త వేరియంట్ ఒమిక్రాన్ త‌గ్గుముఖం ప‌ట్టిన‌ట్లు శాస్త్ర‌వేత్తలు చెప్పార‌ని ఆ దేశ ప్ర‌ధాని బోరిస్ జాన్స‌న్ వెల్ల‌డించారు. దాంతో దేశ‌వ్యాప్తంగా క‌రోనా ఆంక్ష‌ల‌ను ఎత్తివేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. అయితే ఫేస్ కి మాస్క్ కూడా త‌ప్ప‌నిస‌రి కాద‌న్నారు. ఇక ఉద్యోగులకు వర్క్​ ఫ్రం హోం సదుపాయం కూడా ఉండదని బోరిస్ జాన్సన్ పేర్కొన్నారు. వచ్చే వారం నుంచి ఫేస్ మాస్క్, కోవిడ్ పాస్ కూడా అవసరం లేదని స్పష్టం చేశారు. కోవిడ్ సోకినవారు స్వీయ నిర్బంధంలో ఉండాలనే నిబంధనలకు రాబోయే వారాల్లో స్వ‌స్తీ ప‌లికినట్టు ప్ర‌క‌టించారు.

మార్చి 24తో ఈ చట్టం గడువు ముగియనుండగా.. అంతకు ముందే రద్దుచేసే ఆలోచనలో ఉన్నట్టు జాన్సన్ తెలిపారు. దేశంలో కరోనా కేసులు తగ్గాయని, అలాగే.. ఒమిక్రాన్ కేసులు కూడా గరిష్ఠాన్ని తాకడంతో నిబంధనలను సడలించాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. ఇక నుంచి తరగతి గదులలో మాస్క్ తప్పనిసరి నిబంధన ఉంద‌ని అన్నారు. రాబోయే రోజుల్లో సంరక్షణ కేంద్రాల్లోనూ నిబంధనలను సడలించనున్నట్టు స్పష్టం చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కూ.. 36 మిలియన్ల కంటే ఎక్కువ బూస్టర్ డోసులు డెలివరీ చేయబడ్డాయ‌నీ, 60 ఏళ్లు పైబడిన వారిలో 90 శాతం మందికి ఇప్పుడు మూడవ డోస్ ఇవ్వబడిందనీ, అయితే రికార్డు కేసు రేట్లు చాలా వారాలుగా పడిపోయ‌ని తెలిపారు.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/