బ్రిటీష్‌ ఎయిర్‌వేస్‌కు భారీ జరిమానా

British Airways
British Airways

లండన్‌: బ్రిటిష్‌ ఎయిర్‌లైన్స్‌(బీఏ) సంస్థకు భారీగా జరిమాన పడినట్లు ఆ కంపెనీ మాతృసంస్థ ఐఏజీ( ఇంటర్నేషనల్‌ ఎయిర్‌లైన్స్‌ గ్రూప్‌) తెలిపింది. అయితే సదరు సంస్థ నుంచి ప్రయాణికుల సమాచారం తస్కరణకు గురవడమే దీనికి కారణంగా పేర్కొంటున్నారు. దీనికి సంబంధించి యూకే సమాచారశాఖ కమిషనర్‌ నుంచి యూకే సమాచార భద్రత చట్టం కింద తాఖీదులు రానునట్లు ఐఏజీ తెలిపింది. జరిమానా కింద మొత్తం 229.7 మిలియన్‌ డాలర్లు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/