పిల్లలకు వ్యాక్సిన్‌ అవసరం లేదు..బ్రిటన్‌

ప్రజలకు కరోనా టీకాను తప్పనిసరి చేయబోం..మంత్రి మాట్ హాన్‌కాక్

UK health minister Matt Hancock

లండన్‌: కరోనా మహమ్మారి బ్రిటన్‌లో మళ్లీ ఉద్ధృతంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి కీలక ప్రకటన చేశారు. తమ దేశ ప్రజలకు టీకాను తప్పనిసరి చేయబోమని మంత్రి మాట్ హాన్‌కాక్ పేర్కొన్నారు. తమకు టీకా కావాలో, వద్దో ప్రజలు నిర్ణయించుకోగలరని పేర్కొన్న ఆయన పిల్లలకు టీకాలు వేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. పిల్లలు కరోనా వైరస్ బారినపడే అవకాశం తక్కువగా ఉందని, కాబట్టి వారికి టీకా వేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. చాలామంది ప్రజలు టీకా కావాలనే కోరుకుంటున్నారని అన్నారు. కాగా, ప్రపంచమంతా టీకా కోసం ఎదురుచూస్తున్న వేళ బ్రిటన్ మంత్రి ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం బ్రిటన్‌లో కరోనా కేసుల సంఖ్య 12 లక్షల మార్కును దాటేసింది. ప్రస్తుతం దేశంలో రెండో విడత లాక్‌డౌన్ అమలవుతోంది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/