మహిళా మారథాన్‌లో ప్రపంచ రికార్డు

brigid kosgei
brigid kosgei

షికాగో: మహిళల మారథాన్‌లో కొత్త ప్రపంచ రికార్డు నమోదైంది. ఆదివారం జరిగిన షికాగో మారథాన్‌లో కెన్యాకు చెందిన 25 ఏళ్ల బ్రిగిడ్‌ కోస్గె 42.195 కిలోమీటర్ల దూరాన్ని 2 గంటల 14 నిమిషాల 04 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలిచింది. దీంతో 16 ఏళ్ల క్రితం ఇంగ్లాండ్‌కు చెందిన పౌలా రాడ్‌క్లిఫ్‌ నెలకొల్పిన రికార్డును కోస్గే తిరగరాసింది. 2003లో లండన్‌ మారథాన్‌ను 2 గంటల 15 నిమిషాల 25 సెకన్లలో రాడ్‌క్లిఫీ ముగించింది. ఇప్పటి వరకు అదే ప్రపంచ రికార్డు.


తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/