షా బాదే తీరు అచ్చం సెహ్వాగ్‌లా ఉంది : బ్రియన్ లారా…

పృథ్వీషా…భారత క్రికెట్ జట్టుకు భవిష్యత్తు ఆశాకిరణం. అతి చిన్న వయసులోనే జాతీయ జట్టుకు ఎంపికై.తొలి మ్యాచ్‌లోనే శతకం బాది రికార్డు నెలకొల్పాడు. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున ఓపెనర్ బ్యాట్స్‌మెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే ఐపిఎల్‌లో తన మార్కు బ్యాటింగ్ చూసి ఎంతోమంది ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఆజాబితాలో వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం బ్రియన్ లారా కూడా చేరాడు. పృథ్వీషాను ఆకాశానికెత్తాడు. పృథ్వీషాలో అసాధారణమైన ప్రతిభ దాగుందన్నాడు. అతని బ్యాటింగ్‌లో వీరేంద్ర సెహ్వాగ్ కనిపిస్తున్నాడని…బంతిని బాదే తీరు అచ్చం సెహ్వాగ్‌లాగే ఉందని పేర్కొన్నాడు. నజఫ్‌గర్ నవాబ్లోని బ్యాటింగ్ లక్షణాలు పృథ్వీషా ఆటలో కనిపిస్తున్నాయి. పృథ్వీషా తన 19ఏళ్లకే రెండో విడత ఐపిఎల్ కూడా ఆడేశాడు. ఇప్పుడు పృథ్వీషా కూడా సీనియర్ ఆటగాడే అని నవ్వుతూ చెప్పుకొచ్చాడు. షా నుంచి రావాల్సిన క్రికెట్ ఇంకా ఎంతో ఉందని అన్నాడు. పృథ్వీషా 2018లో భారత జట్టు తరుపున తన తొలి టెస్టు మ్యాచ్ ఆడాడు. మొదటి మ్యాచ్‌లోనే శతకం బాది ఔరా అనిపించాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికయ్యాడు. కానీ గాయం కారణంగా ఆ సిరీస్‌కు దూరం కావాల్సి వచ్చింది. ప్రస్తుతం ఐపిఎల్‌లో ఢిల్లీ జట్టు తరుపున ప్రాతినిధ్యం వహిస్తున్న షా…6మ్యాచ్‌లాడి 169 పరుగులు చేశాడు. ఒక మ్యాచ్‌లో 99తో తృటిలో శతకం బాది చేజార్చుకున్నాడు.
మరిన్నీ తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి :https://www.vaartha.com/news/sports/