బ్రీత్ అనలైజర్ టెస్టు-13 మంది ఎయిర్ పోర్టు ఉద్యోగుల సస్పెన్షన్

బ్రీత్ అనలైజర్ టెస్టు-13 మంది ఎయిర్ పోర్టు ఉద్యోగుల సస్పెన్షన్
Breath Analyzer Test – Suspension of 13 Air Port employees

New Delhi: విమానాశ్రయాల్లో పనిచేసే ఉద్యోగులు, ఎయిర్‌లైన్స్ ఉద్యోగులు కలిపి మొత్తంగా 13 మంది  బ్రీత్ అనలైజర్ టెస్టులో విఫలమయ్యారు. సెప్టెంబర్ 16 నుంచి అక్టోబర్ 26 వరకు నిర్వహించిన ఈ టెస్టుల్లో మొత్తం 13 మంది ఉద్యోగులు బుక్ అయ్యారు. వీరంతా మద్యం సేవించి విధి నిర్వహణలో ఉన్నట్లు రుజువు కావడంతో వ  వీరిని మూడునెలల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు సివిల్ ఏవియేషన్  డైరెక్టర్ జనరల్  తెలిపారు. వేటుపడిన వారిలో ఏడుగురు ఇండిగో ఉద్యోగులు కాగా మిగిలిన వారు  గోఎయిర్‌,  స్పైస్ జెట్,  ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఒక్కో ఉద్యోగి ఉన్నారు. ఇటువంటి టెస్టులను నవంబర్ నుంచి పూర్తి స్థాయిలో  నిర్వహించి  మద్యం సేవించి విధి నిర్వహణకు వచ్చిన  వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీసీఏ అధికారులు తెలిపారు.   ఇంకా సస్పెండ్ అయిన వారిలో బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక సీనియర్ అసిస్టెంట్, మరో మేనేజర్‌ కూడా బ్రీత్ అనలైజర్ టెస్టులో విఫలమైన వారిలో ఉన్నారు.   ఇక విమానాశ్రయంలో పనిచేసే ఉద్యోగులను కనీసం 10శాతం మందికైనా అప్పుడప్పుడు బ్రీత్ అనలైజర్  టెస్టులు నిర్వహించాలని ఏవియేషన్ రెగ్యులేటర్ సంస్థ ఆదేశాలు జారీ చేసింది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/