మార్గం మధ్యలోనే నిలిచిపోయిన వందేభారత్‌ రైలు

vande bharat express
vande bharat express

న్యూఢిల్లీ: వందే భారత్‌ ఎస్‌ప్రెస్‌ హస్పీడ్‌ రైలు శుక్రవారం ప్రధాని మోడి ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే అది ప్రారంభమైన మరుసటి రోజే నిలిచిపోయింది. శుక్రవారం ఢిల్లీ నుండి వారణాసికి వెళ్లిన రైలు తిరిగి ఢిల్లికి వస్తుండగా ఈరోజు ఉదయం మధ్యలోనే ఆగిపోయింది. ఇంజిన్‌ రహిత రైలుగా పేర్కొంటున్న ఈ ఎక్స్‌ప్రెస్ దిల్లీకి 200కి.మీ దూరంలో బ్రేకింగ్‌ వ్యవస్థలో లోపం రావడంతో రైలును మధ్యలోనే ఆపాల్సి వచ్చిందని సమాచారం. అయితే ఎక్స్‌ప్రెస్‌కు పశువులు అడ్డుగా రావడం రైలు ఆపడానికి కారణమని కూడా వార్తలు వస్తున్నాయి. రైలు నిలిచిపోవడంతో అందులోని ప్రయాణికులను ఇతర రైళ్లలో గమ్య స్థానాలకు చేర్చే ప్రయత్నం చేశారు. ఇంజినీర్లు వెంటనే లోపాన్ని గుర్తించి సవరించడంతో మళ్లీ 8:30గంటలకు రైలు దిల్లీకి బయలుదేరింది.