లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ హెచ్చరిక

lock down
lock down

న్యూఢిల్లీ: దేశంలో లాక్‌డౌన్‌ అమలు అవుతున్నప్పటికీ కూడా కొందరు వాహన దారులు యధేచ్చగా రోడ్లపైకి వస్తున్నారు. దీంతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది.ప్రతి ఒక్కరు సామాజిక దూరం పాటించని వారిపై, లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ట్వీట్‌ చేశారు. వైద్యులు, పారామెడికల్‌ సిబ్బందిపై దాడులు జరిపితే కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/