గణతంత్ర దినోత్సవాలకు ముఖ్య అతిథి ఈయనే

బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారోను కేంద్ర ప్రభుత్వం ఈసారి గణతంత్ర దినోత్సవాలకు ముఖ్య అతిథిగా ఆహ్వానించింది.

Brazilian President Jair Bolsonaro
Brazilian President Jair Bolsonaro

న్యూఢిల్లీ: ఈసారి గణతంత్ర దినోత్సవాలకు ముఖ్య అతిథిగా బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారోను కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది. 2004లో అప్పటి భారత ప్రభుత్వం బ్రెజిల్ అధ్యక్షుణ్ని చీఫ్ గెస్టుగా పిలిచింది. మళ్లీ ఇప్పుడు రిపీటైంది. ఓవరాల్‌గా బ్రెజిల్ అధ్యక్షులకు ఇది మూడో అవకాశం. అందువల్ల బోల్సోనారో… జనవరి 24న ఇండియా వచ్చి 27 వరకూ ఉండి… రిపబ్లిక్ వేడుకల్ని ఫుల్లుగా చూస్తారు. ఆయనతోపాటూ… 8 మంది బ్రెజిల్ మంత్రులు, 4 ఎంపీలు, సీనియర్ అధికారులు కూడా వెంట వస్తారు. బోల్సోనారో జనవరి 1, 2019న అధ్యక్షుడయ్యారు. ఇంతకు ముందు రెండుసార్లు ఆయన ప్రధాని మోదీని కలిశారు. డార్క్ చాకొలెట్స్ బాగా తయారుచేసే… బ్రెజిల్ మనకు ఫ్రెండ్లీ దేశం. పైగా రెండూ అభివృద్ధి చెందుతున్న దేశాలే. రెండూ పెద్ద దేశాలే. అందుకే ఈసారి రిపబ్లిక్ డే వేడుకల్లో బోల్సోనారోను పిలిచి… ఘనంగా స్వాగతం పలికేయబోతున్నాం. తద్వారా ఆ దేశంతో మన సంబంధాలు మరింత బలపడతాయి.

తాజా తెలంగాణ ఎన్నికల వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/election-news/telangana-election-news/