పెన్షన్‌ విధానం ప్రైవేటికరణ బిల్లుకు బ్రెజిల్‌ పార్లమెంట్‌ ఆమోదం

Congress members in Brazil
Congress members in Brazil

బ్రసీలియా: బ్రెజిల్‌ పార్లమెంట్‌ పెన్షన్‌ విధానాన్ని ప్రైవేటికరించే బిల్లుకు దిగువ సభ భారీ మెజారిటీతో ఆమోదించింది. ఈ బిల్లు ఆమోదానికి 308 ఓట్లు అవసరం కాగా అనుకూలంగా 379, వ్యతిరేకంగా 131 ఓట్లు లభించాయి. పెన్షన్‌ సంస్కరణల పేరుతో పెన్షన్‌ విధానం ప్రయివేటీకరణ కోసం ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు వ్యతిరేకంగా గత నెలలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన, నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. కార్మిక, విద్యార్థి సంఘాల నేతలు ముమ్మర స్థాయిలో వ్యతిరేక ప్రదర్శనలు నిర్వహించారు. ఈ బిల్లు ద్వారా రిటైర్మెంట్‌ వయసును, పెన్షన్‌ నిధికి ఉద్యోగుల చందాలను పెంచటంతో పాటు గర్భిణి మహిళలు, బాలింతలకు ఇస్తున్న రక్షణలను కూడా తొలగించాలని ప్రతిపాదించారు. ప్రస్తుతం బ్రెజిల్‌లో అమలులో ఉన్న విధానం ప్రకారం పెన్షన్‌ నిధికి 35 ఏండ్ల పాటు చందాలు చెల్లిస్తే వారు చెల్లించిన అత్యధిక చందాలో 80 శాతం మేర పెన్షన్‌గా లభిస్తోంది. మహిళలకు ఈ చెల్లింపు గడువు 30 ఏండ్లుగా ఉంది. రిటైర్మెంట్‌ వయసును పెంచాలన్న ప్రతిపాదనకు బ్రెజిల్‌ సెనేట్‌ ఆమోదముద్ర వేస్తే మహిళలకు 62 ఏండ్లు, పురుషులకు 65 ఏండ్లు రిటైర్మెంట్‌ వయసుగా మారుతుంది. ఈ సంస్కరణల బిల్లుపై కార్మిక సంఘాలు నిరసన వ్యక్యం చేస్తున్నాయి.


తాజా ఫోటో గ్యాలరీ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/photo-gallery/