బ్రెజిల్ దేశాధ్య‌క్షుడికి 100 డాల‌ర్ల జ‌రిమానా

సావో పాలో: బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బోల్సోనారోకు 100 డాల‌ర్ల జ‌రిమానా విధించారు. క‌రోనా క‌ట్ట‌డి చ‌ర్య‌లు ఉల్లంఘించారంటూ ఆయనకు జ‌రిమానా విధించారు. మ‌ద్ద‌తుదారుల‌తో క‌లిసి మోటార్‌సైకిల్ ర్యాలీ చేప‌ట్టిన ఆయ‌న‌.. క‌నీసం మాస్కు కూడా పెట్టుకోలేదు. ఇందులో వేల మంది పాల్గొన్నారు. ఓపెన్ హెల్మెట్ పెట్టుకున్నా.. మొహానికి మాస్క్ లేదు. వ‌చ్చే ఏడాది మ‌ళ్లీ అధ్య‌క్ష ప‌ద‌వి ఆశిస్తున్న బోల్సోనారో.. ఇలాంటి భారీ ర్యాలీలు నిర్వ‌హిస్తూనే ఉన్నారు. అయితే త‌మ రాష్ట్ర క‌రోనా ఆంక్ష‌ల‌ను ఉల్లంఘిస్తే ప్రెసిడెంట్‌కు ఫైన్ వేస్తామ‌ని గ‌తంలోనే ప్ర‌త్య‌ర్థి పార్టీ గ‌వ‌ర్న‌ర్ అయిన జావో డోరియా హెచ్చ‌రించారు.

అయితే క‌రోనా ఆంక్ష‌ల విష‌యంలో డోరియాతోపాటు ఇత‌ర గ‌వ‌ర్న‌ర్ల‌తోనూ బోల్సోనారో త‌ర‌చూ ఘర్ష‌ణ‌ల‌కు దిగుతున్నారు. వ్యాక్సిన్లు వేసుకున్న వాళ్ల‌కు ఈ మాస్కుల నిబంధ‌న ఎత్తేయాల‌ని త‌న ర్యాలీల్లోనూ బోల్సోనారో డిమాండ్ చేస్తున్నారు. దీనిని వ్య‌తిరేకిస్తున్న వాళ్ల‌కు సైన్స్ అంటే తెలియ‌న‌ట్లే. వ్యాక్సిన్ వేసుకున్న వాళ్లు అవ‌త‌లి వాళ్ల‌కు వైర‌స్‌ను వ్యాప్తి చేయ‌లేరు అని ఆయ‌న అన్నారు. తాను కూడా మాస్కు లేకుండానే తిరుగుతున్నారు. దీంతో సావో పాలో అధికారులు బోల్సోనారోతోపాటు ఆయ‌న కొడుకు ఎడురాడో, మంత్రి టార్సిసియో గోమ్స్‌కు జ‌రిమానాలు విధించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/