శాఖాహారుల్లో బ్రెయిన్‌ స్ట్రోక్‌ తక్కువ!

ఆహారం-ఆరోగ్యం

Brain stroke is less in vegetarians!
Brain stroke is less in vegetarians!

మెదడు రక్తనాళాలు చిట్లి చనిపోవడం (బ్రెయిన్‌స్ట్రోక్‌) మాంసాహారుల్లో ఎక్కువగా జరుగుతుందని, శాకాహారుల్లో తక్కువగా ఉంటుందని ప్రజలు గతకొంతకాలంగా నమ్ముతూ వస్తున్నారు.

పర్యవసానంగా బ్రిటన్‌లో శాకాహారుల సంఖ్య క్రమంగా పెరుగుతూ ప్రస్తుతం వారి సంఖ్య 17 లక్షలకు చేరుకుంది.

వాస్తవానికి మాంసాహారుల కన్నా శాకాహారుల్లోనే ఈ స్ట్రోక్‌ ఎక్కువగా వస్తాయని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు జరిపిన ఓ సుదీర్ఘ అధ్యయనంలో తేలింది.

వారు 50వేల మందిపై 18 ఏళ్లపాటు అధ్యయనం జరిపి ఈ విషయాన్ని తేల్చారు. మాంసాహారులకన్నా శాకాహారుల్లో బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చే అవకాశం 20శాతం అధికమని పరిశోధకులు తెలిపారు.

శాకాహారుల్లో మెదడు రక్తనాళాల గుండా తక్కువ కొలస్ట్రాల్‌, బీ12 లాంటి విటమిన్లు తక్కువగా ప్రవహించడం వల్ల రక్తనాళాలు చీలిపోయే అవకాశం ఎక్కువగా ఉందని వారు చెప్పారు.

మాంసం తినేవారికన్నా శాకాహారులు, చేపలు తినే మాంసం తినేవారికన్నా శాకాహారులు, చేపలు తినే వారిలో గుండెపోటు వచ్చే అవకాశం 22 శాతం తక్కువని చెప్పారు.

వారు తమ అధ్యయన వివరాలను బ్రిటిష్‌ మెడికల్‌ జర్నల్‌లో ప్రచురించారు.

సగటున 45ఏళ్ల ప్రాయంగల 50వేల మందిని ఎంపిక చేసుకొని వారిపై పరిశోధకులు తమ అధ్యయనం చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/