‘కరోనా రోగుల్లో మెదడు మొద్దు బారుతోంది ‘!

డబ్ల్యుహెచ్ ఓ వెల్లడి

Brain numbness in corona patients
Brain numbness in corona patients

కరోనా రోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రపంచ వైద్య ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) సంచలన విషయాన్ని వెల్లడించింది.

93 శాతం దేశాల్లో కోవిడ్‌ బాధితుల మానసిక పరిస్థితి ప్రమాదకరంగా ఉందని తెలిపింది.

కరోనా బారినపడిన వారిలో ఆందోళన, భయం, చిరాకు, బాధ, ఒంటరితనం వంటి మానసిక రుగ్మత లక్షణాలు కనిపిస్తున్నాయని, మొత్తంగా మెదడు మొద్దుబారి పోతోందని పేర్కొంది.

ఈ లక్షణాల తీవ్రత ఎక్కవగా ఉన్నవారు ఆత్మహత్యకు కూడా వెనుకాడటం లేదని డబ్ల్యుహెచ్‌ఓ స్పష్టం చేసింది.

‘ప్రతీ ఒక్కరు, ప్రతీచోట-అందరికీ మానసిక ఆరోగ్యం’ అనే నినాదంతో ఈ ఏడాది ముందుకు వెళ్తున్నట్టు ప్రకటించింది.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/