బ్రెయిడెడ్‌ హెయిర్‌ స్టైల్‌

కేశాలంకరణ

Braided Hairstyle
Braided Hairstyle

ఒకప్పుడు వాలుజడే అందం. ఇప్పుడు అంత పొడుగాటి జుట్టు ఉండటం లేదు. ఉన్న జుట్టుతో జడ వేసుకోలేం. అన్ని సందర్భాలకు వదిలేయలేం. ఇలాంటి వారికి పరిష్కారం హెయిర్‌స్టైలింగ్‌లో చిన్న చిన్న కిటుకులు పాటించడమే. అప్పుడే ఎక్కడైనా ప్రత్యేకంగా కనిపించ వచ్చు. బ్రెయిడెడ్‌ హెయిర్‌స్టైల్‌ పెళ్లిళ్లు ఇతర వేడుకలకు బాగుంటుంది.

లెహంగాలు, పరికిణీ, ఓణీల్లో ప్రత్యేకంగా కనిపించేలా చేస్తుంది. ముందుగా జుట్టుని చక్కగా దువ్వుకుని మధ్య పాపిట తీయాలి. పై నుంచి రెండువైపులా వెనక్కి అల్లుకుంటూ రావాలి. మెలి తిప్పినా బాగుంటుంది. అల్లుకున్న పాయకు మరో పాయనీ కలుపుతూ రావచ్చు. అలా అల్లిన పాయలు కదలకుండా పిన్నులు పెట్టి జుట్టు వదిలేయవచ్చు.

వీటికి వెనుకవైపు ఫ్లోరల్‌ పిన్నుల్ని పెట్టుకుంటే ప్రత్యేకంగా కనిపిస్తారు. ఫిష్‌టెయిల్‌కు జుట్టుని రెండు పాయలుగా విడదీయాలి. బయటివైపు నుంచి సన్నని పాయను తీసుకుని రెండో భాగంలో కలపాలి. ఇలానే మరోవైపు చేయాలి. ఇలా చేసుకుంటూ చివర్లో రబ్బరు బ్యాండ్‌ పెట్టుకుంటే చాలు. ట్రెండీ లుక్‌తో ఆకట్టుకోవచ్చు. ఆధునిక దుస్తుల మీదకు అదిరిపోతుందీ హెయిర్‌స్టైల్‌. సింగిల్‌ బ్రెయిడ్‌ లూజ్‌ హెయిర్‌ స్లైల్‌కు జుట్టుని చిక్కుల్లేకుండా దువ్వుకుని పాపిట తీయాలి.

Braided Hairstyle-
Braided Hairstyle-

జుట్టు ముందుభాగంలో ఒకవైపు మాత్రమే ఫ్రెంచ్‌ స్టైల్లో అల్లుకోవాలి. అలా వెనుక వరకూ అల్లుకుని జుట్టు ముందుకు వేసుకుంటే పార్టీ లుక్‌తో మెరిసి పోవచ్చు. డచ్‌ బ్రెయిడ్‌ చూడ్డానికి కష్టంగా అనిపించినా వేసుకోవడం తేలిక. సాధారణంగా మనం అల్లేటప్పుడు ఒక పాయ మీద నుంచి మరో పాయను వేసుకుంటాం కదా!

ఇక్కడ వెనుకవైపు అల్లాలి. అంటే.. ఒకదాని కింద నుంచి మరొకదాన్ని తీయాలి. పై నుంచి కిందకు అల్లుకుంటూ వెళ్లాలి. క్రీడాకారిణులకు ఇది మంచి లుక్‌ను తెచ్చిపెడుతుంది. సాధారణంగా జుట్టుని రెండు భాగాలుగా చేసి క్లిప్‌ పెట్టుకోవటం తెలిసిందే. దీనిలో పైన పఫ్‌లా కొంత జుట్టు తీసుకుని ముందు నుంచి మధ్య వరకూ అల్లు కోవాలి.

ఆపై జుట్టుని వదిలేసుకోవచ్చు. పొట్టి జుట్టు ఉన్నవారికే కాదు పొడవు జుట్టు ఉన్నవారికీ బాగుంటుంది. వెస్ట్రన్‌ లుక్‌తో కనిపించాలనుకునే వారికి ఇది సరైన ఎంపిక.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/