పవన్ మూవీలో బ్రహ్మానందం కీలక పాత్ర

హాస్య బ్రహ్మ బ్రహ్మానందం గత రెండేళ్లు గా వెండితెర ఫై ఎక్కువగా కనిపించడం లేదు. ఒకప్పుడు బ్రహ్మి లేని సినిమా ఉండేది కాదు..అలాంటిది ఇప్పుడు బ్రహ్మానందం లేకుండానే ఎన్నో సినిమాలు వచ్చాయి. కొత్త కొత్త కమెడియన్లు తెరకు పరిచయం అవ్వడం..కొత్త కామెడీ తో నవ్విస్తుండడం తో బ్రహ్మానందం ను అందరు పక్కకు పెట్టారు. సీనియర్ డైరెక్టర్స్ అప్పుడప్పుడు బ్రహ్మానందం కు సరిపడా రోల్స్ ఇస్తున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ సినిమాలో బ్రహ్మానందం ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.

సముద్రఖని డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ వినోదాయ సీతమ్ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. సాయి ధరమ్ తేజ్ సైతం ఈ మూవీ లో నటిస్తున్నాడు. కాగా ఈ మూవీ కి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే , మాటలు అందిస్తున్నాడు. ఈ నేపధ్యంలోనే బ్రహ్మానందం కోసం ఓ మంచి పాత్రని సృష్టించినట్లు తెలుస్తుంది. రెగ్యులర్ కమెడియన్ తరహాలో కాకుండా మంచి ఇంటరెస్టింగ్ రోల్ లో బ్రాహ్మీని త్రివిక్రమ్ ఈ మూవీలో రిప్రజెంట్ చేసినట్లు తెలుస్తుంది.

త్రివిక్రమ్ అత్తారింటికి దారేది సినిమా వరకు బ్రహ్మానందం అతని ప్రతి సినిమాలో కచ్చితంగా ఉండేవారు. మంచి టైమింగ్ ఉన్న పాత్రలలో మెప్పించేవారు. అతని చివరి మూడు సినిమాలలో మాత్రం బ్రాహ్మికి ఛాన్స్ లేదు. అయితే మరల వినోదాయ సీతమ్ సినిమా కోసం ఓ మంచి పాత్రతో మరల బ్రాహ్మీకి గ్రాండ్ ఎంట్రీని త్రివిక్రమ్ ఏర్పాటు చేసినట్లు టాక్ వినిపిస్తుంది. మరి ఆ పాత్ర ఎలా ఉంటుందనేది చూడాలి.