మైఖెల్‌ జాక్సన్‌ను తలపించిన మాథ్యూ వేడ్‌

Matthew Wade
Matthew Wade

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియా-న్యూజిలాండ్‌ జట్ల మధ్య నేడు జరుగుతున్న మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది.కివీస్‌ బౌలర్లను ఎదుర్కొనే క్రమంలో ఆసిస్‌ ఆటగాడు మాథ్యూ వేడ్‌ ఫేమస్‌ పాప్‌ సింగర్‌ మైఖెల్‌ జాక్సన్‌ ఫోజు ఒకటి పెట్టాడు. లబుషేన్‌ ఔటైన తర్వాత క్రీజులోకి అడుగుపెట్టిన వేడ్‌ వచ్చీ రాగానే నీల్‌ వాగ్నెర్‌, టిమ్‌ సౌథీల బంతులను ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలో మాథ్యూవేడ్‌ను ఇబ్బంది పెట్టే ప్రయత్నంలో యార్కర్లు, బౌన్సర్లతో దాడి చేశారు. అయితే ఆ బంతులను ఎదుర్కొనే నేపథ్యంలో వేడ్‌ సరికొత్త ఫోజులను పెట్టాడు. అయితే అందులో ఒకటి అచ్చం మైఖెల్‌ జాక్సన్‌ స్టెప్‌ను పోలి ఉంది. దీంతో క్రికెట్‌ ఆస్ట్రేలియా తన అధికారిక ట్విట్టర్‌లో ఈ ఫోటోను పోస్టు చేసింది. వేడ్‌ నువ్వు బానే ఉన్నావుగా? నువ్వు బానే ఉన్నావుగా వేడ్‌ అంటూ కామెంట్‌ పెట్టి పోస్టు చేసింది. అంతేకాకుండా వేడ్‌ పక్కన మైఖెల్‌ జాక్సన్‌ ఫోటోను జత చేసింది ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో వైరల్‌గా మారింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/