దక్షిణ ఢిల్లీ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా బాక్సర్‌ పోటీ

vijender singh
vijender singh, boxer


న్యూఢిల్లీ: పద్మశ్రీ అవార్డు గ్రహీత, 2008 బీజింగ్‌ ఒలంపిక్స్‌ కాంస్య పతక విజేత బాక్సర్‌ విజేందర్‌ సింగ్‌..సౌత్‌ ఢిల్లీ నుంచి పోటీ చేస్తారని కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది. ఈ సందర్భంగా విజేందర్‌ సింగ్‌ మాట్లాడుతూ..కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, రాహుల్‌ గాంధీ, జనరల్‌ సెక్రటరీ ప్రియాంక గాంధీకి ధన్యవాదాలు తెలిపారు. 20 ఏళ్లపాటు బాక్సింగ్‌కు తన జీవితాన్ని అంకితం చేశాను. ఇప్పుడు ప్రజా సేవ చేసేందుకు ముందుకు వచ్చాను. ఢిల్లీ ప్రజలు తనను ఆశీర్వదిసదిస్తారనే నమ్మకం ఉందని విజేందర్‌ తెలిపారు. ఇక ఇదే స్థాణం నుంచి బిజెపి తరఫున సిట్టింగ్‌ ఎంపి రమేశ్‌ బిధూరి, ఆప్‌ తరఫున రాఘవ్‌ చద్దాల పోటీ పడుతున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/