ఏ తప్పు చేసి ఉండకపోవచ్చనే ధైర్యంతోనే అనంతబాబు తిరుగుతున్నారు: బొత్స

మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనంతబాబుపై ఆరోపణలు

అమరావతి: మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైస్సార్సీపీ ఎమ్మెల్సీ ఉదయభాస్కర్ (అనంతబాబు) విషయమై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. ఆయన ఎక్కడో వివాహానికి హాజరైనట్టు తాను మీడియాలో చూశానని పేర్కొన్నారు. ఆయన ఏ తప్పు చేసి ఉండకపోవచ్చని, ఆ ధైర్యంతోనే ఆయన అలా తిరుగుతుండొచ్చని అన్నారు.

అనంతబాబుపై తాము కేసు నమోదు చేశామని, నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. సుబ్రహ్మణ్యం మృతి కేసులో ఆయన తల్లి, భార్య వాంగ్మూలం ఇచ్చి ఉంటే ఈపాటికే ఎమ్మెల్సీ అరెస్టై ఉండేవారని అన్నారు. ఈ విషయంలో వారు రెండు రోజులపాటు నిర్లక్ష్యం చేశారని మంత్రి బొత్స విమర్శించారు.

తాజా జాతీయం వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/