రోజుకోరకంగా మాట్లాడటం ఆయన కు అలవాటే

అన్ని కమిటీల నివేదికలు పరిశీలించాకే మూడు రాజధానుల నిర్ణయం

Botsa Satyanarayana
Botsa Satyanarayana

అమరావతి: మంత్రి బొత్స సత్యనారాయణ ఈరోజు తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుపై ధ్వజమెత్తారు. రోజుకోరకంగా మాట్లాడటం చంద్రబాబుకు అలవాటేనని ఆయన రాజకీయ లబ్ధికోసం ఎలాగైనా మాట్లాడుతారని బొత్స విమర్శించారు. కాగా అన్ని కమిటీల నివేదికలను చూసిన తర్వాతే.. మూడు రాజధానుల నిర్ణయం జరిగిందన్నారు. రాజధాని నిర్ణయంలో చంద్రబాబులాగా వ్యాపారుల సలహాలు తీసుకోలేదన్నారు. విశాఖపై ఇప్పుడు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. చంద్రబాబు విధానాల వల్లే ఏపీకి ఆర్థిక ఇబ్బందులు వచ్చాయన్నారు.

శివరామకృష్ణన్ కమిటీ సలహాలు చంద్రబాబు పట్టించుకోలేదన్నారు. 1985లో శాసన మండలి రద్దు సమయంలో 2007లో మళ్లీ శాసన మండలి పునరుద్ధరణ సమయంలో టీడీపీ నేతలు అన్న వ్యాఖ్యలు, తాజాగా మళ్లీ మండలి రద్దు సమయంలో చంద్రబాబు మాటలను పరిశీలిస్తే.. వారు రాజకీయంగా లబ్ధిని చూసుకునే మాట్లాడుతారన్నది స్పష్టమైందని బొత్స వివరించారు. శాసన మండలి రద్దుకు, రాజధానికి సంబంధం లేదంటూ.. కొంచెం ఆలస్యం అవుతేందేమోకాని నిర్ణయం మారదని స్పష్టం చేశారు. అన్ని వర్గాల, ప్రాంతాల శ్రేయస్సు కోసమే వికేంద్రీకరణ జరుగుతోందన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/