విమర్శలెదుర్కుంటున్న బ్రిటన్‌ ప్రధాని

బ్రిటన్‌ ప్రధాని.. ట్రంప్‌ అప్‌డేటెడ్ వెర్షన్‌

Emmanuel Macron-Boris Johnson
Emmanuel Macron-Boris Johnson

పారిస్‌: బోరిస్‌ బ్రిటన్‌ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా ఫ్రాన్స్‌ పర్యటనకు వచ్చారు ఈ సందర్భంగా ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మన్యుయేల్‌ మెక్రాన్‌ ఇద్దరూ కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమయంలో మెక్రాన్‌ ముందు ఉన్న టీ పాయ్‌ మీద బోరిస్‌ కాలు పెట్టి మీడియా ప్రతినిధులకు ‘హాయ్‌’ చెప్పారు. తర్వాత మెక్రాన్‌తో ముచ్చట్లు మొదలు పెట్టారు. బోరిస్ అలా ప్రవర్తించినప్పటికీ మెక్రాన్‌ మాత్రం ఇబ్బంది పడకుండా నవ్వుతూ ఉండటం గమనార్హం.
ఈ సందర్భంగా తీసిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రధాని స్థాయి వ్యక్తి సాటి అధినేత పట్ల ప్రవర్తించిన తీరు అభ్యంతరకరంగా ఉందని విమర్శలు వస్తున్నాయి. బోరిస్‌ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో పోలుస్తున్నారు. ట్రంప్‌ సైతం చాలా సందర్భాల్లో తన దుందుడుకు వ్యాఖ్యలతో వివాదాల్లో నిలిచారని కామెంట్లు చేస్తున్నారు.గర్వంతో కూడిన ప్రవర్తన, డొనాల్డ్‌ ట్రంప్‌ అప్‌డేటెడ్‌ వెర్షన్‌, పద్ధతి తెలీని వ్యక్తి.. రెండో డొనాల్డ్‌ ట్రంప్‌ అని జాసన్‌ బోరిస్‌ విమర్శలేదుర్కంటున్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/