అస్సాం సీఎం హిమంత‌పై కేసు న‌మోదు

అసోం, మిజోరం మ‌ధ్య మ‌రింత‌ పెరిగిన స‌రిహ‌ద్దుల ర‌గ‌డ‌

న్యూఢిల్లీ : అసోం, మిజోరం మధ్య సరిహద్దు ర‌గ‌డ‌ మరింత పెరిగింది. ఇటీవ‌ల‌ సరిహద్దుల్లో జరిగిన ఘర్షణల్లో ఆరుగురు అసోం పోలీసులు ప్రాణాలు కోల్పోయిన విష‌యం తెలిసిందే. సరిహద్దుల్లో జ‌రిగిన‌ ఘర్షణలకు తాము డ్రగ్స్ అక్రమ రవాణాను అడ్డుకోవడమే కారణమని అసోం సీఎం అంటున్నారు. అయితే, స‌రిహ‌ద్దు హింస‌కు సంబంధించిన మిజోరంలో ఈ రోజు కేసులు న‌మోదు కావ‌డం గ‌మ‌నార్హం.

ఏకంగా అసోం సీఎం హిమంత బిశ్వ‌శ‌ర్మ‌పై మిజోరంలో క్రిమినల్ కేసు న‌మోదైంది. అలాగే, అసోంకు చెందిన న‌లుగురు పోలీసు అధికారులు, ఇద్ద‌రు ప‌రిపాల‌న అధికారులపై కూడా మిజోరం పోలీసులు కేసులు న‌మోదు చేశారు. కాగా, భ‌ద్ర‌తా రీత్యా మిజోరం స‌రిహ‌ద్దుల వ‌ద్ద‌కు ఎవ‌రూ వెళ్లకూడ‌ద‌ని త‌మ పౌరుల‌కు అసోం ప్ర‌భుత్వం సూచ‌న చేసింది. అసోం ప్ర‌జ‌ల‌ను రెచ్చ‌గొట్టే విధంగా మిజోరం విద్యార్థి సంఘాలు వ్య‌వ‌హ‌రిస్తున్నాయ‌ని చెప్పింది. మిజోరానికి రాక‌పోక‌లు కొన‌సాగించకూడ‌ద‌ని తెలిపింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/