దేశవ్యాప్తంగా 18ఏళ్లు నిండిన వారికి బూస్టర్ డోస్ : కేంద్రం

ప్రైవేట్ కేంద్రాల ద్వారా పంపిణీ

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 18 ఏళ్లు నిండిన వారికి బూస్టర్ డోస్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. 18 ఏళ్లు పైబ‌డ్డ వారందరూ బూస్ట‌ర్ డోస్ తీసుకోవాల్సిందేన‌ని ప్ర‌క‌టించిన కేంద్ర ప్ర‌భుత్వం.. ఈ నెల 10 (ఆదివారం) నుంచి బూస్ట‌ర్ డోస్ పంపిణీని మొద‌లుపెట్ట‌నున్న‌ట్టు ప్ర‌క‌టించింది. బూస్ట‌ర్ డోస్ పంపిణీని ప్రైవేట్ కేంద్రాల ద్వారా చేయనున్నట్టు కూడా కేంద్రం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. దీనిపై ప‌లు వ‌ర్గాల నుంచి విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/