ఏపీలో డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రా పోలీసుల‌కు తెలిసే జ‌రుగుతుందంటూ బోండా ఉమా సంచలన వ్యాఖ్యలు

డ్రగ్స్ వ్యవహారం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలను కుదిపేస్తోంది. ఏపీలో హెరాయిన్ స‌ర‌ఫరా అవుతుంద‌ని టీడీపీ నేత‌లు త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నార‌ని పేర్నినాని అన్నారు. ఎక్కడో గుజరాత్‌తో పట్టుబడ్డ డ్రగ్స్‌కు..విజయవాడకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. ప్రజలు టీడీపీని తిరస్కరించినా..ఆ పార్టీ నేతల్లో మార్పు రావడం లేదని విమర్శించారు. ఈ విమర్శల పట్ల బోండా ఉమా స్పందించారు.

ఏపీలో డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రా పోలీసుల‌కు తెలిసే జ‌రుగుతుందంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో డ్ర‌గ్స్ దందాపై విచార‌ణ జ‌రింపిచాల‌ని తాము డీఆర్ఐకి లేఖ రాస్తామ‌ని ..రాష్ట్రంలో త‌యారు అవుతున్న మ‌ద్యంలో ఇవే డ్ర‌గ్స్ ను వాడుతున్నారంటూ ఉమా సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. వైసీపీ ప్ర‌భుత్వం మ‌ద్ద‌తు తోనే డ్ర‌గ్స్ దిగిమ‌తి జ‌రుగుతోందని ఉమా ఆరోప‌ణ‌లు చేయ‌డం ఇప్పుడు సంచ‌ల‌నం రేపుతోంది.