సిద్ధమైన పత్రాలపై జీఎన్‌రావు కమిటీ సంతకాలు చేసింది

ఆరు రోజుల్లో రాష్ట్ర రాజధానిని కమిటీ ఎలా నిర్ణయిస్తుంది?

Bonda Umamaheswara Rao
Bonda Umamaheswara Rao

మంగళగిరి: తాడేపల్లిలో సిద్దమైన పత్రాలపై జీఎన్‌రావు కమిటీ సంతకాలు చేసిందని టిడిపి నేత బొండా ఉమా విమర్శించారు. జీఎన్‌ రావు కమిటీ నివేదికపై మంగళగిరిలోని టిడిపి కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు రాష్ట్రంలోని 10 జిల్లాలను కేవలం 6 రోజుల్లోనే కమిటీ పర్యటించిందన్నారు. ఆరు రోజుల్లో రాష్ట్ర రాజధానిని కమిటీ ఎలా నిర్ణయిస్తుందని బొండా ఉమా ప్రశ్నించారు. ఎవరినీ అడక్కుండానే జీఎన్‌రావు, బీసీజీ కమిటీలు వేశారని బొండా ఆరోపించారు. ఈ కమిటీ అందరినీ కలిశామని చెప్పడం నిజం కాదని బొండా విమర్శించారు. కాగా టిడిపి అధినేత చంద్రబాబునాయుడు విశాఖలోనే అన్ని సమావేశాలను ఏర్పాటు చేసేవారని బొండా ఉమా గుర్తు చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/