గుడివాడలో క్యాసినో..బోండా ఉమ కారుపై రాళ్ల దాడి

టీడీపీ కార్యాలయంపై రాళ్లు రువ్విన వైస్సార్సీపీ శ్రేణులు

గుడివాడ: కృష్ణా జిల్లా గుడివాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మంత్రి కొడాలి నానికి చెందిన కన్వెన్షన్ సెంటర్ లో క్యాసినో నిర్వహించిన వ్యవహారం రాజకీయ దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై నిగ్గు తేల్చేందుకు టీడీపీ నిజనిర్ధారణ కమిటీ గుడివాడకు వెళ్లింది. ఈ నేపథ్యంలో కన్వెన్షన్ సెంటర్ కు వెళ్లేందుకు అనుమతి లేదంటూ పోలీసులు టీడీపీ నేతలను అడ్డుకున్నారు. ఈ క్రమంలో గుడివాడలోని టీడీపీ కార్యాలయంపై వైస్సార్సీపీ శ్రేణులు దాడికి యత్నించారు. టీడీపీ కార్యకర్తలపై రాళ్లు రువ్వారు. అంతేకాదు టీడీపీ నేత బోండా ఉమ కారు అద్దాలను ధ్వంసం చేశారు. ఇంత జరుగుతున్నా పోలీసులు చోద్యం చూస్తూ ఉన్నారంటూ టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/