ఉజ్జయిని అమ్మవారికి బంగారు బోనం

భాగ్య నగరంలో బోనాల సందడి

Minister Talasani at the Bonam festival
Minister Talasani at the Bonam festival

Hyderabad: భాగ్యనగరంలో బోనాల సందడి మొదలైంది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు ఆదివారం ఉదయం ప్రారంభమయ్యాయి. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రభుత్వం తరపున అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన ఆయన ఉజ్జయిని అమ్మవారికి బంగారు బోనం సమర్పించి పూజలు చేశారు. పండుగ నేపథ్యంలో భక్తులు ఈ తెల్లవారుజాము నుంచే పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. వేడుకలను తిలకించేందుకు ప్రధాన ప్రాంతాల్లో భారీ ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. ప్రజలను చల్లగా చూడాలని, కరోనా బారి నుంచి బయటపడేలా అనుగ్రహించాలని అమ్మవారిని కోరుకున్నట్టు చెప్పారు.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/