ఇళ్లల్లోనే బోనాల పండుగ

కరోనా ప్రభావంతో ప్రభుత్వం నిర్ణయం

Bonam Festival -File
Bonam Festival -File

Hyderabad: బోనాల పండుగ రద్దు అయింది. సిటీలో కరోనా వ్యాప్తి విజృంభణ కారణంగా ఈ ఏడాది బోనాల పండుగను రద్దు చేస్తున్నట్టు మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ వెల్లడించారు.

బోనాల నిర్వహణపై బుధవారం మంత్రులు సమీక్ష నిర్వహించారు.
మంత్రి తలసాని మాట్లాడుతూ, ఆలయాల్లో బోనాలను పూజారులు మాత్రమే నిర్వహిస్తారని తెలిపారు.

గటాల ఊరేగింపును ఆలయ పరిసరాల్లో పూజారులు మాత్రమే చేస్తారన్నారు.

అమ్మవార్లకు పట్టువస్త్రాలు పూజారులే సమర్పిస్తారని తెలిపారు.

ప్రజలందరూ ఎవరి ఇంటిల్లో వారే బోనాలు పండుగ జరుపుకోవాలన్నారు..

కావున నగర ప్రజలు సహకరించాలని మంత్రి తలసాని విజ్ఞప్తిచేశారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/