మహారాష్ట్రలో బాంబు పేలుడు : ట్రక్కు డ్రైవర్‌ మృతి

bomb blast
bomb blast

ముంబయి: మహారాష్ట్ర కొల్హాపూర్‌లో ఒక ట్రక్కులో గుర్తు తెలియని వ్యక్తులు అమర్చిన బాంబు పేలడంతో ట్రక్కు డ్రైవర్‌ అక్కడిక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాజకీయ పక్షాలు ప్రచారం సందడిలో ఉండగా ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంలనం సృష్టించింది. ఒక ట్రక్కు డ్రైవర్‌ తన స్నేహితుడితో కలిసి వాహనాలో వచ్చి బండిని రోడ్డు పక్కగా ఆపాడు. ఇద్దరూ మాట్లాడుకుంటుండగానే భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. దాంతో డ్రైవర్‌ అక్కడిక్కడే చనిపోగా, తీవ్రంగా గాయపడిన అతని స్నేహితుడిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని బాంబు డిస్పోజల్‌ స్క్వాడ్‌ తనిఖీ చేసింది. గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మృతుడి స్నేహితుడిని సంఘటనపై అధికారులు ప్రశ్నిస్తున్నారు.
తాజా చెలి వార్తల కోసం క్లిక్‌ చేయండి.. https://www.vaartha.com/specials/women/